రెస్టారెంట్‌కి అనుకోని అతిథి.. గప్‌చిప్ అయిపోయిన కస్టమర్లు

సరదాగా తినేసి వద్దాం అనుకొని ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన కస్టమర్లకు అనుకోని అతిథి షాక్ ఇచ్చింది. ఆ అతిథి ప్రాణాలు తీసే జంతువు కావడంతో

  • Manju Sandulo
  • Publish Date - 11:55 am, Fri, 30 October 20

Leopard strolls restaurant: సరదాగా తినేసి వద్దాం అనుకొని ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన కస్టమర్లకు అనుకోని అతిథి షాక్ ఇచ్చింది. ఆ అతిథి ప్రాణాలు తీసే జంతువు కావడంతో.. దాని కంటపడకుండా కస్టమర్లు గప్‌చిప్‌ అయిపోయారు. తమపై దాడి చేస్తుందన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. టేబుల్‌, కుర్చీల మధ్య దాక్కొని ఆ పులి అక్కడి నుంచి వెళ్లే వరకు ఎదురుచూశారు.

ఈ వీడియోను క్రుగర్ సైటింగ్స్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో షేర్ చేశాడు. గత వారం షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఆ చిరుత మాత్రం ఎవ్వరినీ ఏమనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుత ఎవరిపై దాడి చేయలేదని రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.(‘రంగ్ దే’ టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!)

దీనిపై ఓ కస్టమర్ స్పందిస్తూ.. చిరుతపులిని ఇంత దగ్గరగా చూడటం నిజంగా అరుదైన అనుభవం. దాన్ని చూసినప్పుడు ప్రాణాలతో భయపడతామని అనుకోలేదు. కానీ వన్యమృగాలకు, మనుషులకు మధ్య సామరస్యత ఉంటుదని ఈ ఘటనతో రుజువైంది. అది లోపలికి రాగానే మేమంతా ప్రాణభయంలో దిక్కులు చూస్తున్నాము. కానీ చిరు మాత్రం దానికి అదే వెళ్లిగా బయటకు వెళ్లిపోయింది అని చెప్పుకొచ్చాడు.(IPl 2020: దినేష్ కార్తీక్‌, అంపైర్‌ మధ్య తెలుగు సంభాషణ.. వీడియో వైరల్‌)