మూడు రాజధానుల ప్రకటన ఎఫెక్ట్‌.. జగన్‌కు ఝలక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

సొంత పార్టీలోనే వైఎస్ జగన్‌కు షాక్ తగిలింది. ఆయన ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములాను నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు. అసెంబ్లీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రెండూ ఒకే చోట ఉండాలని.. అప్పుడే పరిపాలన బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశాఖను ఏపీకి ఆర్ధిక రాజధానిగా చేయాలని కోరారు. ఈ విషయంపై సీఎం జగన్‌ను కలిసి మాట్లాడతానని ఆయన తెలిపారు. ఇకపోతే అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా.. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా.. జ్యూడిషియరీ కేపిటల్‌గా కర్నూలును చేసే […]

మూడు రాజధానుల ప్రకటన ఎఫెక్ట్‌.. జగన్‌కు ఝలక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
Follow us

|

Updated on: Dec 20, 2019 | 1:55 PM

సొంత పార్టీలోనే వైఎస్ జగన్‌కు షాక్ తగిలింది. ఆయన ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములాను నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు. అసెంబ్లీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రెండూ ఒకే చోట ఉండాలని.. అప్పుడే పరిపాలన బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశాఖను ఏపీకి ఆర్ధిక రాజధానిగా చేయాలని కోరారు. ఈ విషయంపై సీఎం జగన్‌ను కలిసి మాట్లాడతానని ఆయన తెలిపారు.

ఇకపోతే అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా.. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా.. జ్యూడిషియరీ కేపిటల్‌గా కర్నూలును చేసే అవకాశాలున్నాయని సీఎం జగన్ ఆలోచనకు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. టీడీపీ, జనసేన అమరావతినే రాజధానిగా ఉంచాలని చెబుతుంటే.. బీజేపీ మాత్రం సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించింది.

మూడు రాజధానుల ప్రకటనతో వైసీపీ నేతలు అందరూ మద్దతు ఇస్తారనుకుంటే.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మరో రకమైన వాదనను వినిపిస్తుండటంతో ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తానికి ఆయన జగన్‌ను కలిసి ఈ విషయంపై చర్చిస్తానని చెప్పడంతో టీడీపీతో పాటు వైసీపీలో కూడా రాజధానుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది.