జగన్ మరో షాకింగ్ నిర్ణయం: మండలి రద్దేనా?

ఏపీ శాసన మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం కార్యరూపం ఇవ్వనున్నారా? వాడీవేడీగా జరుగుతున్న అసెంబ్లీ స్పెషల్ సెషన్ సందర్బంగా లాబీల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఈ చర్చకు కొనసాగింపుగా.. మండలి రద్దు సాధ్యాసాధ్యాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలి రద్దుపై అసెంబ్లీలో సాధారణ మెజారిటీతో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపితే.. పార్లమెంటులో చర్చించి దాన్ని ఆమోదిస్తే చాలు.. మండలి రద్దు అయిపోతుందని వైసీపీ నేతలు చెబుతుంటే.. […]

జగన్ మరో షాకింగ్ నిర్ణయం: మండలి రద్దేనా?
Follow us

|

Updated on: Jan 21, 2020 | 1:42 PM

ఏపీ శాసన మండలిని రద్దు చేయాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం కార్యరూపం ఇవ్వనున్నారా? వాడీవేడీగా జరుగుతున్న అసెంబ్లీ స్పెషల్ సెషన్ సందర్బంగా లాబీల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఈ చర్చకు కొనసాగింపుగా.. మండలి రద్దు సాధ్యాసాధ్యాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలి రద్దుపై అసెంబ్లీలో సాధారణ మెజారిటీతో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపితే.. పార్లమెంటులో చర్చించి దాన్ని ఆమోదిస్తే చాలు.. మండలి రద్దు అయిపోతుందని వైసీపీ నేతలు చెబుతుంటే.. టీడీపీ నేతలు దానితో విభేదిస్తున్నారు. మండలిని రద్దు చేయడం అంత సులభం కాదని, కేంద్రం టాప్ ప్రియారిటీగా టేకప్ చేస్తే తప్ప ఈ తతంగం అంత త్వరగా ముగియదని అంటున్నారు తెలుగు దేశం నేతలు.

నిజానికి శాసనమండలిని రద్దు చేసే యోచనలో జగన్ ప్రభుత్వం వున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి మరికొంత సమయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ.. తాజాగా మూడు రాజధానుల బిల్లుపై మండలిలో కొనసాగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. మండలిలో టీడీపీ మెజారిటీ తగ్గి, వైసీపీ మెజారిటీ పెరగడానికి కనీసం నాలుగేళ్ళ సమయం పట్టే అవకాశం వుంది. అప్పటికి కూడా వైసీపీ పూర్తి స్థాయిలో మండలిపై పట్టు సాధించకపోవచ్చు.

ఇలా ప్రతీ కీలక బిల్లు విషయంలో శాసనమండలిలో ఎంబర్రాస్‌మెంట్ ఎదుర్కొనే బదులుగా దాన్ని ఏకంగా రద్దు చేస్తే సరిపోతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తేవచ్చని అందుకోసం.. అవసరమైతే ప్రత్యేక సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించవచ్చని తాజాగా అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏ క్షణమైనా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మండలి రద్దు బిల్లుకు ఆమోదం తెలపవచ్చని వెలగపూడి అసెంబ్లీ ఏరియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

గతంలో ఎన్టీఆర్ కూడా శాసన మండలిలో కాంగ్రెస్ నేతలు కలిగిస్తున్న చిరాకును తప్పించుకునేందుకు ఏపీ మండలిని ఆరోవేలుతో పోలుస్తూ దాని రద్దుకు చర్యలు తీసుకున్నారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వున్నప్పటికీ ప్రధాని రాజీవ్ గాంధీ హుందాగా వ్యవహరించి, ఏపీ ప్రభుత్వం పంపిన మండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించారు. కానీ తాజా పరిణామాలు అంత సులువుగా ఏమీ లేవని తెలుస్తోంది. వైసీపీ-బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్న తరుణంలో ఒకవేళ ఏపీ అసెంబ్లీలో శాసన మండలి రద్దు తీర్మానం చేసినా.. దాన్ని గవర్నర్ వద్ద జాప్యం చేయొచ్చు.. లేదా కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకు వెళ్ళడానికి సమయం తీసుకోవచ్చు. ఏది జరిగినా.. మండలి వెంటనే రద్దు కాదు.

అయితే, రాష్ట్ర బీజేపీ నేతలతో జగన్ మోహన్ రెడ్డికి అంత మంచి రిలేషన్స్ లేకపోయినా.. బీజేపీ జాతీయ నేతలతో జగన్‌కు మంచి అవగాహనే వుంది కాబట్టి మండలి రద్దుపై బీజేపీ అధినాయకత్వం జగన్‌కు సహకరించవచ్చని వైసీపీ నేతలు అంఛనా వేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం మండలి రద్దు అంత సులభం కాదని వాదిస్తున్నారు. కౌన్సిల్ రద్దు చెయ్యాలంటే చాలా ప్రక్రియ ఉందని, పార్లమెంట్ నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యం అవుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఈ ప్రక్రియకు కనీసం ఏడాది పడుతుందని అంటున్నారాయన. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మాత్రం మండలిని రద్దు చేస్తామంటే భయపడేది లేదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం మాత్రమే చెయ్యగలరని, దానికి భిన్నంగా తామే మండలిలో తాము తీర్మానం చేస్తామని లోకేశ్ చెబుతున్నారు.

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!