Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

శాసన రాజధాని అమరావతి: ప్రభుత్వ రాయితీలు ఇవే

legislative capital amaravati, శాసన రాజధాని అమరావతి: ప్రభుత్వ రాయితీలు ఇవే

ఏపీకి సంపూర్ణ రాజధానిగా వున్న అమరావతి త్వరలోనే శాసన రాజధానిగా మారబోతోంది. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా మారనున్న అమరావతికి జరిగే నష్టాన్ని అదే స్థాయిలో పూడ్చేందుకు ప్రభుత్వం భారీ నజరానానే ప్రకటించింది. ముఖ్యంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

అమరావతిలో శాసనసభతోపాటు సంబంధిత అన్ని కార్యాలయాలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. అయితే, జీఎన్ రావు, బోస్టన్ గ్రూపు ప్రతిపాదించిన రాజ‌భవన్‌ను మాత్రం విశాఖకు తరలించారు. ముందుగా ప్రకటించినట్లుగా హైకోర్టు బెంచ్ కూడా అమరావతిలో ఏర్పాటు కావడం లేదు. అయితే, శాసనసభ భవనం, శాసనసభ సచివాలయం మాత్రం అమరావతిలో కొనసాగుతాయి.

అయితే రాజధాని కోసం ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న క్లారిటీ శాసనసభ ప్రత్యేక సమావేశాల తొలిరోజునే వచ్చేసింది. రాజధాని గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. అయితే ప్రభుత్వ సాయం గత ప్రకటనల కంటే ఎక్కువ స్థాయిలో వుంటుందని ఆయన తెలిపారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను 2500 నుంచి 5 వేల రూపాయలకుకు పెంచబోతున్నామని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్‌ భూములు ఇచ్చిన అసైన్డ్‌ దారులకు కూడా రిటర్న్‌ ప్లాట్ల కేటాయిస్తామన్నారు.

భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే యాభై వేలు రూపాయలు, మెట్టభూమికి అయితే 30 వేల రూపాయలు 10 ఏళ్ల పాటు చెల్లించాలన్నది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఇపుడు జగన్ సర్కార్ 15 సంవత్సరాలకు పొడిగించారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ ఒక లక్ష రూపాయిలు, మెట్టభూమికి 60 వేల రూపాయల అవుతుందని చెప్పారు మంత్రి బొత్స.

Related Tags