కారులో పాట.. బుడ్డోడి కేరింతలు

Kid Dances in Car Goes Viral, కారులో పాట.. బుడ్డోడి కేరింతలు

పసిపిల్లలు నిద్రలో నవ్వటం సహాజం..బుజ్జిబుజ్జి పాపాయిలు అలా నవ్వుత ఉంటే..మనంచూసిముచ్చటపడతాం..అంతే కాదు..ఉన్న అవకాశాలను బట్టి వారి నవ్వులను మన కెమెరాలలో బంధించుకునే ప్రయత్నం కూడా చేస్తాం. చిన్నారుల నవ్వులు, కేరింతలు, చిలిపి పనులు, ఆటపాటలను మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేసి మన బంధుమిత్రులతో కూడా షేర్‌ చేసుకుంటాం..అలా ఓ పెరెంట్స్‌ షేర్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. కారు వెనక సీట్లో హాయిగా నిద్రపోతున్న బుడతడు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి డ్యాన్స్‌ చేస్తాడు..ఆ టైమ్‌లో కారులో ప్లే అవుతున్న బేబీ మ్యూజిక్‌ సాంగ్‌కు బుడ్డొడు నిద్రలేచి మరీ స్టేప్పులేయటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన ఐదు రోజుల్లోనే 7.7 మిలియన్‌ ఫ్యూస్‌ సంపాదించుకుంది. దాదాపు 5 లక్షల లైక్‌లు, 2 లక్షల వరకు కామెంట్స్‌తో దుమ్మురేపుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నచిచ్చర పిడుగు ఏం చేశాడో తెలిస్తే…తప్పక మీరు కూడా లైక్‌ కొడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *