బీరూట్ లో మళ్ళీ రేగిన మంటలు, దట్టమైన పొగలు

లెబనాన్ రాజధాని బీరూట్ లో గురువారం భారీ ఎత్తున మంటలు, పొగలు రేగాయి. గత నెల 4 న సుమారు మూడు వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలిపోయి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ ఘటనలో 190 మంది మరణించగా..

బీరూట్ లో మళ్ళీ రేగిన మంటలు, దట్టమైన పొగలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2020 | 5:47 PM

లెబనాన్ రాజధాని బీరూట్ లో గురువారం భారీ ఎత్తున మంటలు, పొగలు రేగాయి. గత నెల 4 న సుమారు మూడు వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలిపోయి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ ఘటనలో 190 మంది మరణించగా ఆరున్నరవేలమందికి పైగా గాయపడ్డారు. ఆ దారుణ ఘటన ను ఇంకా మరిచిపోక ముందే గురువారం ఓ గిడ్డంగిలో ఉంచిన ఆయిల్, టైర్లు మంటలతో  పేలిపోయాయి. ఆర్మీ హెలికాఫ్టర్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయని సైన్యం తెలిపింది. పోర్ట్ బీరూట్ లో ఈ ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. చాలామంది ఇళ్ళు వదిలి దూర ప్రాంతాల్లోని తమ బంధువుల ఇళ్లకు బయల్దేరారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు.