ఢిల్లీ.. ఆసుపత్రుల సిబ్బందికి సెలవులు రద్దు.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశం

ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యాన నిర్వహిస్థున్న  అన్ని ఆసుపత్రులు, వైద్య సంస్టల్లో పని చేసే ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వారంతా తక్షణమే తమ విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు. మరీ అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులను మంజూరు చేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్ఫష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద గల ఆయా ఆస్పత్రులు, వైద్య సంస్థలకు చెందిన ఎం డీలు, డీన్ లు, డైరెక్టర్లు తమ సిబ్బందికందరికీ ఈ […]

ఢిల్లీ.. ఆసుపత్రుల సిబ్బందికి సెలవులు రద్దు.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 5:46 PM

ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యాన నిర్వహిస్థున్న  అన్ని ఆసుపత్రులు, వైద్య సంస్టల్లో పని చేసే ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వారంతా తక్షణమే తమ విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు. మరీ అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులను మంజూరు చేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్ఫష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద గల ఆయా ఆస్పత్రులు, వైద్య సంస్థలకు చెందిన ఎం డీలు, డీన్ లు, డైరెక్టర్లు తమ సిబ్బందికందరికీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సలహా ఇస్తున్నట్టు వీటిలో  పేర్కొన్నారు.  నగరంలో కేవలం ఒక్క రోజులోనే 3,137 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా.. సిటీలో కరోనా రోగులకు 5 రోజుల నిర్బంధ క్వారంటైన్ అవసరమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చేసిన ప్రకటనపై ప్రభుత్వం పూర్తి వ్యతిరేకతను ప్రకటించింది. ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, రాఘవ చద్దా వంటి వారు కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. తాను ప్రస్తుతం ఇంటిలో స్వీయ నియంత్రణలో ఉన్నానని. అలాంటప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఎలా ఉంటానని అతిషి ప్రశ్నిస్తున్నారు.  ఏమాత్రం స్వల్పంగా కరోనా లక్షణాలు కనబడినా తప్పనిసరిగా వారిని అయిదు రోజులపాటు క్వారంటైన్ కి తరలించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల ఆదేశించారు.

వివాదాస్పద ఆర్డర్ ఉపసంహరణ

కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించినా ఆ రోగులను తప్పనిసరిగా 5 రోజుల క్వారంటైన్ కి తరలించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నట్టు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.  లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సీఎం కేజ్రీవాల్ మంత్రివర్గంలోగానీ, పాలక ఆప్ పార్టీలో గానీ సుముఖత వ్యక్తం కాలేదు. ఈ నిర్ణయాన్ని మెజారిటీ నేతలు వ్యతిరేకించారు.

యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..