గుంటూరు జిల్లాలో కౌలురైతు కలకలం.. కత్తులతో పొడుచుకొని పొలంలోనే ఆత్మహత్యాయత్నం..

గుంటూరు జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టిస్తోంది. భూ వివాదం నేపథ్యంలో సలీం అనే రైతు పొలంలోనే కత్తితో

గుంటూరు జిల్లాలో కౌలురైతు కలకలం.. కత్తులతో పొడుచుకొని పొలంలోనే ఆత్మహత్యాయత్నం..
Follow us

|

Updated on: Dec 22, 2020 | 2:04 PM

గుంటూరు జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టిస్తోంది. భూ వివాదం నేపథ్యంలో సలీం అనే రైతు పొలంలోనే కత్తితో పొడుచుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రులో సలీం అనే కౌలు రైతు గ్రామంలోని పద్మావతికి చెందిన 7.5 ఎకరాల పొలం సాగు చేస్తున్నాడు.

ఆ భూమి యాజమన్య హక్కుల విషయంలో పద్మావతికి, శివారెడ్డి అనే వ్యక్తికి మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. అయితే పంటపై తనకు పూర్తి హక్కులు కల్పించాలని సలీం అధికారుల్ని కలిసి నిత్యం వేడుకుంటున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పొలంలో సాగు చేసిన పంటను కోసేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇవాళ ఉదయం పొలం వద్దకు అధికారులు రాగా సలీం కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పక్కన ఉన్న వాళ్లు అతడిని ఆపేందుకు యత్నించినా అప్పటికే అతను కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా నిరసన తెలిపాడు. చివరికి పోలీసులు సలీంను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.