Breaking News
  • స్పందనపై సీఎం జగన్‌ సమీక్ష. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల పంపిణీకి భూములు సేకరించాలి. గ్రామ సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను సమీక్షించాలి. నకిలీ మద్యం, అక్రమ ఇసుక రవాణాలపై.. స్థానిక ఎస్పీకి సమాచారం ఇవ్వాలి-సీఎం జగన్‌. పెన్షన్లు, పీఎఫ్‌ కార్డుల రీ వెరిఫికేషన్‌ అనంతరం.. లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. మార్చి 1కల్లా దిశ పీఎస్‌లు సిద్ధం కావాలన్న సీఎం జగన్‌. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ను అభినందించిన సీఎం జగన్‌.
  • మరోసారి నేను అమెరికా అధ్యక్షుడిని కావడం ఖాయం. కరోనాను నియంత్రించడంలో చైనా సమర్థవంతంగా పనిచేస్తోంది. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయి. ఒప్పందానికి ముందు కొన్ని చట్టపరమైన చిక్కులు అధిగమించాలి-ట్రంప్‌.
  • ఢిల్లీ: ఉత్తరాది ప్రాంతాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి. ఢిల్లీలో అల్లర్లపై బీజేపీ సమాధానం చెప్పాలి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎందుకున్నారు. ఢిల్లీలో పరిస్థితిని ఎందుకు కంట్రోల్‌ చేయలేకపోతున్నారు. నాపై ఎంతకాలం రాజకీయాలు చేస్తారు. బీజేపీ ప్రభుత్వం ఆందోళనకారులను అదుపుచేయడంలో విఫలమైంది-ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.
  • కొన్ని రాజకీయ పార్టీలు, ఆందోళనకారులు మతంతో చట్టానికి ముడిపెట్టారు. మేం 130 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకునే చట్టం తెచ్చాం. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు. ఈ చట్టం పాక్‌, బంగ్లా, ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. కొంత మంది కావాలనే బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబడతున్నారు. ఆందోళనకారులను ఉక్కు పాదంతో అణచివేస్తాం. ప్రజలను ఒవైసీ రెచ్చగొడుతున్నారు-కిషన్‌రెడ్డి.
  • కిషన్‌రెడ్డి, ఒవైసీ మధ్య మాటలయుద్ధం. ఢిల్లీలో అల్లర్లపై బీజేపీ సమాధానం చెప్పాలి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎందుకున్నారు. ఢిల్లీలో పరిస్థితిని ఎందుకు కంట్రోల్‌ చేయలేకపోతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఆందోళనకారులను.. అదుపుచేయడంలో విఫలమైంది-ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. కొన్ని రాజకీయ పార్టీలు మతంతో చట్టానికి ముడిపెట్టారు. 130 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకునే చట్టం తెచ్చాం. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు-కిషన్‌రెడ్డి. ఈ చట్టం పాక్‌, బంగ్లా దేశీయుల కోసమే కానీ.. ఏ మతాలకూ వ్యతిరేకం కాదు-కిషన్‌రెడ్డి. కొంత మంది కావాలనే బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. ఆందోళనకారులను ఉక్కు పాదంతో అణచివేస్తాం. ప్రజలను ఒవైసీ రెచ్చగొడుతున్నారు-కిషన్‌రెడ్డి.

ఫస్ట్ లుక్ అదిరిపోయింది..పుల్ పిక్చర్ ఎలా ఉండబోతోందో?

Akshay Kumar’s Laxmmi Bomb, ఫస్ట్ లుక్ అదిరిపోయింది..పుల్ పిక్చర్ ఎలా ఉండబోతోందో?

ముంబయి: దక్షిణాదిలో సూపర్‌హిట్‌ సిరీస్‌గా నిలిచిన ‘కాంచన’ ఇప్పుడు బాలివుడ్‌లోనూ సందడి చేయబోతోంది. ఈ క్రేజీ హర్రర్ సిరీస్‌కు ఆద్యుడైన రాఘవా లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘లక్ష్మీ బాంబ్‌’  టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఫర్హాద్‌ సామ్‌జీ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 5న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఫస్ట్‌లుక్‌లో అక్షయ్‌ కళ్లకు కాటుక పెట్టుకుంటూ కనిపించారు. ఓ చక్కటి కథను మీకు చూపించబోతున్నాం అంటూ అక్షయ్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. అదే విధంగా కియారా ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తన తర్వాతి ప్రాజెక్టు కోసం అక్షయ్‌తో కలిసి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Related Tags