లక్ష్మణ్‌కు త్వరలో పదవీగండం..ఎందుకంటే?

తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఏక్షణంలోనైనా బీజేపీకి కొత్త అధ్యక్షుడుని జాతీయ నాయకత్వం నియమించే అవకాశముందని ఢిల్లీ నుంచి వస్తోన్న సమాచారం. నిజానికి గత డిసెంబర్ నెలతోనే ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీ కాలం ముగిసింది.‌ ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే కొన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించారు. అయితే వివిధ కారణలతో తెలంగాణ శాఖకు ఇంకా అధ్యక్షుడికి నియమించలేదు. తాజాగా తెలంగాణలో […]

లక్ష్మణ్‌కు త్వరలో పదవీగండం..ఎందుకంటే?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 01, 2020 | 5:08 PM

తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఏక్షణంలోనైనా బీజేపీకి కొత్త అధ్యక్షుడుని జాతీయ నాయకత్వం నియమించే అవకాశముందని ఢిల్లీ నుంచి వస్తోన్న సమాచారం. నిజానికి గత డిసెంబర్ నెలతోనే ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీ కాలం ముగిసింది.‌ ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే కొన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించారు. అయితే వివిధ కారణలతో తెలంగాణ శాఖకు ఇంకా అధ్యక్షుడికి నియమించలేదు. తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగియటంతో…..ఏ క్షణానైనా అధ్యక్షుడి నియామకం ఉంటోందని తెలుస్తోంది.

తాజాగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధ్యక్ష పదవిపై ప్రభావం చూపుతాయని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ నడుస్తోంది. నిజానికి ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌నే కొనసాగిస్తారని కొందరు నేతలు మొన్నటి వరకు చెప్పుకొచ్చారు. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత లక్ష్మణ్ కొనసాగింపుపై స్పష్టత లేదని వారే అంటున్నారు.

మున్సిపల్ ఎన్నికలో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు‌. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేసింది. అధికార టీఆర్ఎస్‌తో పాటు.. ఎంఐఎం, కాంగ్రెస్‌లతో కూడా ప్రత్యక్షంగా తలపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 70 శాతానికి పైగా వార్డులు, 80శాతానికిపైగా డివిజన్లలో బీజేపీ పోటీచేసింది. మున్సిపాలిటీల్లో ఆశించిన ఫలితాలు రాలేదు‌.అయితే కార్పోరేషన్లలో మాత్రం కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఈవిధంగా చూస్తే మాత్రం బీజేపీ అధ్యక్షుడు పనితీరుపై జాతీయ నాయకత్వం సంతృప్తి చెందే అవకాశముందనేది కొందరి బీజేపీ నాయకుల వాదన.

మరోవైపు అధ్యక్ష పదవి కోసం పాత నాయకులతో పాటు‌‌….కొత్త నేతలు సైతం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్టు సమాచారం‌. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు…. మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలు అధ్యక్ష రేసులో ముందున్నారు. చింతల రామచంద్రారెడ్డి కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేసి.. ప్రస్తుతం రేసు నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ కంచుకోట గద్వాలలో 10వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించటం డీకే అరుణకు కలిసొచ్చే అంశం. ఇంకోవైపు యువ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సైతం అధ్యక్ష పదవి ఆశిస్తున్నా వీరికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే 60 స్థానాలున్న నిజామాబాద్ నగరపాలక సంస్థలో 28స్థానాల్లో పార్టీని గెలిపించడం అరవింద్‌కు, కరీంనగర్ కార్పొరేషన్‌లో 13 స్థానాలు గెలిపించుకోవటం బండి సంజయ్ కుమార్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మరోవైపు అధ్యక్షడి ఎంపికలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత్ర కూడా కీలకమని సమాచారం. గతంలో చింతల లాంటి వారిని కిషన్ రెడ్డి సమర్థించినా.. ప్రస్తుతం లక్ష్మణ్ వైపే కిషన్ రెడ్డి కూడా మొగ్గుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తంమీద మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ల‌క్ష్మణ్‌కు పదవి గండం నుంచి ఊర‌ట నిచ్చిన‌ట్టేనా? లేక అశించిన స్థాయి ఫ‌లితాలు రాకపోవడంతో లక్ష్మణ్‌పై వేటు ఖాయమేనా? ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది.

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!