Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌… రోహిత్‌ కెరీర్‌‌లోనే బెస్ట్‌

Latest Test rankings released Rohit jumps, ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌… రోహిత్‌ కెరీర్‌‌లోనే బెస్ట్‌

సౌతాఫ్రికాతో విశాఖపట్నం టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో దుమ్ము రేపిన రోహిత్‌ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అతను 36 స్థానాల్ని మెరుగుపర్చుకొని 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్‌ టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇతనికి జోడీగా ఆడిన మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ర్యాంకూ మెరుగైంది. అతను 38 స్థానాల్ని మెరుగుపర్చుకొని కెరీర్‌ బెస్ట్‌ 25వ ర్యాంకులో నిలిచాడు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ 900 రేటింగ్‌ పాయింట్ల దిగువన పడిపోయాడు. గతేడాది జనవరి నుంచి 900 పైబడిన రేటింగ్‌ పాయింట్లతో ఉన్న కోహ్లి ఖాతాలో ఇప్పుడు 899 పాయింట్లున్నాయి. టాప్‌ ర్యాంకులో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి. టెస్టు బౌలర్ల జాబితాలో మళ్లీ భారత స్పిన్నర్‌ అశ్విన్‌ టాప్‌–10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడం ద్వారా 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌లో భారత్‌  తొలి టెస్టు విజయంతో 40 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొత్తం 160 పాయింట్లతో ఉంది. విండీస్‌పై 2–0తో గెలవడం ద్వారా 120 పాయింట్లను పొందింది.

కెరీర్‌ బెస్ట్‌గా 710 పాయింట్లు దక్కించుకున్న పేసర్‌ షమి 18వ ర్యాంకునుంచి 16కు చేరాడు. ఆల్‌రౌండర్లలో జడేజా రెండో ర్యాంక్‌ చేజిక్కించుకున్నాడు. మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకొంది. మూడో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌ (122) కంటే టీమిండియా (125 పాయింట్లు) 3 పాయింట్లు ముందుంది. ఆస్ట్రేలియా (151) టాప్‌ర్యాంకులో కొనసాగుతోంది.