Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

కోహ్లీ ఓ లెజెండ్.. ప్రశంసలతో ముంచెత్తిన స్మిత్!

Latest Sports News, కోహ్లీ ఓ లెజెండ్.. ప్రశంసలతో ముంచెత్తిన స్మిత్!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.? ఠక్కున గుర్తొచ్చే రెండు పేర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్. అన్ని ఫార్మాట్లలోనూ తమదైన శైలిలో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటారు. ఇక వీరిద్దరిలో ఎవరు గొప్పా అని మాజీ క్రికెటర్ల దగ్గర నుంచి విశ్లేషకుల వరకు అందరూ చర్చించుకుంటారు. కొందరు విరాట్ ది బెస్ట్ అని అంటే.. మరికొందరు స్మిత్‌ అద్భుతమైన ఆటగాడని అంటుంటారు. అయితే స్మిత్ మాత్రం తనకంటే కోహ్లీనే గొప్ప ఆటగాడని చెప్పడమే కాకుండా అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఒక అద్భుతం. అతడు సాధించిన రికార్డులే.. అతను అత్యుత్తమ ఆటగాడని చెప్పకనే చెబుతున్నాయి. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతూ లెజెండ్స్ నెలకొల్పిన రికార్డులను సైతం తన వశం చేసుకుంటున్నాడు. మున్ముందు ఇంకా ఎన్నో రికార్డులు కోహ్లీ సొంతం కానున్నాయి. అతడి పరుగుల దాహాన్ని ఎవరూ ఆపలేరు. అటు ‘స్పిరిట్ అఫ్ ది క్రికెట్’ అవార్డు కోహ్లీకి దక్కడం కూడా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని స్మిత్ అన్నాడు.

ఒక్క ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇండియాకు అద్భుతమైన విజయాలు అందించడంలో ఎంతగానో కృషి చేశాడు. ధోని తర్వాత టీమిండియాను విజయపథంలో నడిపిస్తూ… అన్ని ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలబెట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాడని స్టీవ్ స్మిత్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Related Tags