జైడస్‌ టీకా ‘జైకోవ్‌-డీ’ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ..!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం జైడస్‌ కేడిలా తన ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను గురువారం ప్రారంభించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ

జైడస్‌ టీకా ‘జైకోవ్‌-డీ’ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ..!
Covid-19 Vaccine

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం జైడస్‌ కేడిలా తన ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను గురువారం ప్రారంభించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ కొవిడ్‌-19 కి కారణమయ్యే సార్స్‌ సీఓవీ-2 అనే వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు అభివృద్ధి చేసిన డీఎన్‌ఏ- ఆధారిత వ్యాక్సిన్‌కు ‘జైకోవ్‌-డీ’ అని పేరుపెట్టింది. కాగా, ఈ టీకా మొదటి దశ ట్రయల్‌లో సురక్షితం, బాగా తట్టుకోగలదని తేలినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనా కట్టడికోసం ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ పరిశోధనల్లో తలమునకలై ఉన్నాయి. కాగా.. ఫేజ్ వన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో ఆరోగ్యకరమైన వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చామని, వారు మోతాదును బాగా తట్టుకోగలిగారని జైడస్ తెలిపింది. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వెయ్యి మంది వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వచ్చిన ఫలితం జైకోవ్-డీ భద్రతకు మైలురాయి. క్లినికల్ ఫార్మకోలాజికల్ యూనిట్‌లో అన్ని విషయాలపై 24 గంటలపాటు పరిశీలించాం. ఆ తర్వాత ఏడు రోజులూ నిశిత దృష్టిపెట్టాం. టీకా చాలా సురక్షితం అని తేలిందని కంపెనీ పేర్కొంది.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!

Click on your DTH Provider to Add TV9 Telugu