బిగ్‌బాష్ లీగ్‌లోకి సిక్సర్ల వీరుడు

ఆస్ట్రేలియాలో జరిగే (BBLK) బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్ ఆడలేదు. యాక్టివ్ ప్లేయర్లు విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. ఫలితంగా ఒక్క భారత క్రికెటర్ కూడా బిగ్‌బాష్‌లో అడుగుపెట్టలేకపోయాడు.

బిగ్‌బాష్ లీగ్‌లోకి సిక్సర్ల వీరుడు
Follow us

|

Updated on: Sep 08, 2020 | 6:12 PM

యువరాజ్ సింగ్.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్..గత ఏడాది అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆటకు ముగింపు పలికిన ఆటగాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లోనే యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది సిక్సర్ కింగ్ అయ్యాడు. వరస సిక్సులు కొట్టి  ప్రపంచకప్ హీరోగా మారిపోయాడు.

అయితే ఇప్పుడు యూవీ ప్రతిష్ఠాత్మక బిగ్‌బాష్ లీగ్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ విషయంలో సానుకూలంగా ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా అతడి కోసం ఓ జట్టును వెతికే పనిలో పడింది. ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ కథనం ప్రకారం.. మాజీ ఆల్‌రౌండర్ అయిన యువరాజ్ కోసం ఆసక్తి ఉన్న ఫ్రాంచైజీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా వెతుకులాట మొదలు పెట్టింది. స్పోర్ట్స్ అండ్ మీడియాకు చెందిన యువరాజ్ మేనేజర్ జాసన్ వార్న్ దీనిని ధ్రువీకరించారు.

ఆస్ట్రేలియాలో జరిగే (BBLK) బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్ ఆడలేదు. యాక్టివ్ ప్లేయర్లు విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. ఫలితంగా ఒక్క భారత క్రికెటర్ కూడా బిగ్‌బాష్‌లో అడుగుపెట్టలేకపోయాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు గతేడాది వీడ్కోలు పలికిన 38 ఏళ్ల యువరాజ్ సింగ్‌‌కు ఇప్పుడు విదేశీ లీగుల్లో ఆడే అవకాశం దక్కనుంది.

2011 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన యువరాజ్ చివరిసారి 2017లో టీమిండియా తరఫున  ఆడాడు. యువరాజ్ తన కెరియర్‌లో 304 వన్డేలు ఆడి 8,701 పరుగులు చేశాడు. 111 వికెట్లు తీసుకున్నాడు. 40 టెస్టులు, 58 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఐపీఎల్ సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు ఆడతే అది బీబీఎల్‌కే గొప్ప విషయమన్నాడు.

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..