ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయండిః విజయసాయిరెడ్డి

రాయలసీమ ప్రజలకి కృష్ణా మిగుల జలాలని అందించి, రాయలసీమని రత్నాలసీమగా మార్చాలనే చిరకాల స్వప్నం నెరవేరబోతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయండిః విజయసాయిరెడ్డి
Vijayasai reddy
Balaraju Goud

|

Oct 07, 2020 | 7:33 PM

రాయలసీమ ప్రజలకి కృష్ణా మిగుల జలాలని అందించి, రాయలసీమని రత్నాలసీమగా మార్చాలనే చిరకాల స్వప్నం నెరవేరబోతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఈ దిశగా పడిన తొలి అడుగు పడటం శుభపరిణామమన్నారు. సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యని పరిష్కరించటానికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

బుధవారంలో ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె. సింగ్ ను కలిసిన ఆయన రాయలసీమ కరువు నివారణ పథకం, వైయస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాయలసీమ కరువు నివారణ పథకానికి ఎలక్ట్రికల్ మెకానికల్ కాంపోనెంట్ కింద రూ. 12,012 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, వైయస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు ఎలక్ట్రో మెకానికల్ కాంపోనెంట్ కింద రూ. 3,008 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులతో ఆంధ్ర ప్రదేశ్ సస్యశ్యామలం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కు సహకరించాలని ఆయన కోరారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu