కారు అద్దాలు పగిలితే మాకేం సంబంధం..?

కారు అద్దాలు పగిలితే మాకేం సంబంధం అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మల్యే జోగి రమేష్. నిజంగా ఘటన జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని సబ్బం హరి ఆక్రమించుకున్నాడు.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నదానికి చర్యలు తీసుకుంటే తప్పా.! అని జోగి రమేష్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దానికి చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు పెడతారు.. టిడిపి నేత పట్టాభి కారు అద్దం పగిలితే.. టిడిపి నేతలు హడావుడి చేస్తున్నారని.. చంద్రబాబు, లోకేష్ నుంచి ప్రతి ఒక్కరూ […]

కారు అద్దాలు పగిలితే మాకేం సంబంధం..?
Follow us

|

Updated on: Oct 04, 2020 | 1:29 PM

కారు అద్దాలు పగిలితే మాకేం సంబంధం అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మల్యే జోగి రమేష్. నిజంగా ఘటన జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని సబ్బం హరి ఆక్రమించుకున్నాడు.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నదానికి చర్యలు తీసుకుంటే తప్పా.! అని జోగి రమేష్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దానికి చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు పెడతారు.. టిడిపి నేత పట్టాభి కారు అద్దం పగిలితే.. టిడిపి నేతలు హడావుడి చేస్తున్నారని.. చంద్రబాబు, లోకేష్ నుంచి ప్రతి ఒక్కరూ ట్వీట్లు, ఖండనలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

వాళ్ళు రాళ్లు వేసుకొని.. ఇలా చవకబారు కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతిదాడికి దిగారు. ‘రథాలు తగలబెడతారు.. విగ్రహాలు ధ్వసం చేస్తారు.. వీళ్ళే ఆందోళనలు చేస్తారు. ఈ ఘటనలకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబే. బాబు ఎన్ని కుట్రలు పన్నినా.. జగన్ ప్రభుత్వాన్ని ఏమి చేయలేరు. ప్రతిపక్ష హోదా కూడా పోయే సమయం వచ్చింది.’ అంటూ జోగి రమేష్ విమర్శలందుకున్నారు. సిపిఐ రామకృష్ణ క్యాపిటలస్టుగా మారిపోయారు.. కమ్యూనిస్టులు సిద్దాంతం వదిలేసి.. చంద్రబాబు పంచన చేరారు. బాబు లాంటి క్యాపిటలిస్టులకు అమ్ముడు పోయారంటూ సిపిఐ రామకృష్ణ పైనా విమర్శలందుకున్నారు జోగి రమేష్.