చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే పోలీస్ కంప్లైంట్..

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై  పాయకరావుపేట వైపీసీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.  దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని నక్కలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను కించపరుస్తూ కామెంట్స్ చేసిన చంద్రబాబుపై..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బాబు సీఎంగా ఉన్న సమయం నుంచి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:47 am, Mon, 6 January 20
చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే పోలీస్ కంప్లైంట్..

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై  పాయకరావుపేట వైపీసీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.  దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని నక్కలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను కించపరుస్తూ కామెంట్స్ చేసిన చంద్రబాబుపై..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బాబు సీఎంగా ఉన్న సమయం నుంచి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశాక కూడా ఆయన తన పద్దతిని మార్చకోలేదని పేర్కొన్నారు.

40 ఏళ్ల ఎక్స్‌పిరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతిసారి దళితులను అవమానించడం కామనైపోయుందని..ఇప్పుటికైనా ఆ పార్టీలో ఉన్న దళితులు ఆయన అసలు రూపాన్ని తెలుకోవాలన్నారు. కాగా ఏపీకి రాజథాని, సమగ్రాభివృద్ది విషయంలో ఇటీవలే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూఫ్ ఇటీవలే తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కౌంటర్‌ ఇచ్చే సందర్భంలో చంద్రబాబు ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను కించపరిచారని అధికార వైసీపీ ఆరోపణలు చేస్తోంది.