వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆర్థిక లావాదేవీల అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు సీబీఐ అధికారులు.

వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్
Follow us

|

Updated on: Sep 26, 2020 | 3:25 PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆర్థిక లావాదేవీల అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు సీబీఐ అధికారులు. శుక్రవారం పులివెందులకు చెందిన చెప్పుల షాపు ఓనర్ మున్నాతో పాటు మరో ఇద్దరిని ప్రశ్నించారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు ఈనెల 20న తొలిసారిగా మున్నాను విచారించారు. అనంతరం ఆయన బ్యాంకు ల్యాంకరులో పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు గుర్తించిన సీబీఐ అధికారులు.. గత మూడు రోజులు క్రితం మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో మున్నా నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం అందుతోంది. సీబీఐ ఎస్పీ స్థాయి మహిళా అధికారిణి సమక్షంలో విచారణ సాగుతోంది.

నేడు కడప, పులివెందులకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఐదు రోజుల కిందట వీరిద్దరూ విచారణకు హాజరైనవారే. మరోసారి వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకాతో వీరికున్న ఆర్థిక సంబంధాలు, ఇతర వ్యవహారాలపై సీబీఐ విచారిస్తోన్నట్లు తెలుస్తోంది. మున్నా చెెప్పులు షాపులో పనిచేసే బాబు అనే యువకున్ని కూడా నేడు ప్రశ్నిస్తున్నారు.

Also Read :

కృష్ణా జిల్లాలో యాక్సిడెంట్, తండ్రీకూతుళ్లను బలితీసుకున్న లారీ