వివేకా హత్య కేసు విచారణ.. తీర్పు రిజర్వు

మాజీ మంత్రి.. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకానంద భార్య సౌభాగ్యమ్మతో పాటు కూతరు సునీత దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. 

వివేకా హత్య కేసు విచారణ.. తీర్పు రిజర్వు
Follow us

|

Updated on: Feb 24, 2020 | 10:16 PM

మాజీ మంత్రి.. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకానంద భార్య సౌభాగ్యమ్మతో పాటు కూతరు సునీత దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది.  తీర్పును కోర్టు రిజర్వులో పెట్టింది. పోస్టుమార్టం రిపోర్ట్, జనరల్ కేసు డైరీని ఇవాళ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సీఎం జగన్​ గతంలో వేసిన పిటిషన్​ను వెనక్కి తీసుకునేందుకు మెమో దాఖలు చేశారు. పిటిషన్ ఉపసంహరణపై జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.  దీనిపై వివేకా కుమార్తె తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వులో ఉంచింది.