పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆమె ముందుండి నడిపించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ క్యాడర్ లో ఉత్సాహం నింపారు. ఆకాంక్షించిన విధంగా అన్న సీఎం అవ్వడంతో ఆమె ఇప్పుడు ఫుల్ సంతోషంలో ఉన్నారు. ఆమె ఎవరో కాదు సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఆమె పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ… సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసిన తన అన్నపై ఆమె మరోసారి ప్రశంసించారు. “ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెక్కిరిస్తున్నా.. మరోవైపు కరోనా ఖర్చు భారంగా మారినా.. ప్రజలకు మంచి చేయాలనే నీ ధృడ సంకల్పానికి హాట్సాఫ్ అన్నా” అంటూ ట్విట్ చేశారు. నీ స్వచ్ఛమైన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఆ దేవుడి దయ, ప్రజల దీవెనలు, పైనుంచి నాన్న ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటాయి జగనన్న అని పేర్కొన్నారు.
ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెక్కిరిస్తున్నా.. మరోవైపు కరోనా ఖర్చు భారంగా మారినా.. ప్రజలకు మంచి చేయాలనే నీ ధృడ సంకల్పానికి హాట్సాఫ్ అన్నా..@ysjagan #YSRMatsyakaraBharosa #YSJaganCares pic.twitter.com/UVP38Uhwn8
— YS Sharmila (@ys_sharmila) May 6, 2020
నీ స్వచ్ఛమైన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఆ దేవుడి దయ, ప్రజల దీవెనలు, పైనుంచి నాన్న ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటాయి జగనన్న #YSRMatsyakaraBharosa #YSJaganCares pic.twitter.com/JL8XahAG6v
— YS Sharmila (@ys_sharmila) May 6, 2020
అంతకుముందు పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యాదీవెన స్కీమ్ తీసుకొచ్చిన సీఎం జగన్… ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేశారు. దీనిపై స్పందించిన షర్మిల… పేదలకు మేలు చేయడానికి తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే… తాను రెండు అడుగులు ముందుకేస్తానని తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని గుర్తు చేశారు. పేదవాడికి మంచి చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్ నిలిచారని జగనన్న విద్యాదీవెన స్కీమ్ గురించి ప్రస్తావించారు. తన అన్న..సీఎం జగన్ ప్రారంభించిన ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని షర్మిల ట్వీట్ చేశారు.