కీలక నిర్ణయం తీసుకొన్న యూట్యూబ్!

యూట్యూబ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడాన్ని నిషేధించనున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. ఇక నుంచి యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మరణవార్తలను.. ఎన్నికల తేదీల విషయంలో తప్పుడు సమాచారాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే.. వెంటనే ఆ వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగిస్తామని గూగుల్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ అండ్ సేఫ్టీ  టీమ్‌ను ఏర్పాటు […]

కీలక నిర్ణయం తీసుకొన్న యూట్యూబ్!

యూట్యూబ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడాన్ని నిషేధించనున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. ఇక నుంచి యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మరణవార్తలను.. ఎన్నికల తేదీల విషయంలో తప్పుడు సమాచారాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే.. వెంటనే ఆ వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగిస్తామని గూగుల్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ అండ్ సేఫ్టీ  టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌లు నిరంతరం యూట్యూబ్‌లోని వీడియోలను పరిశీలిస్తుంటుందని.. అది తప్పుడు సమాచారం అని తెలిసిన వెంటనే ఆ వీడియోలను తొలగిస్తుందని వారు పేర్కొన్నారు.  యూట్యూబ్‌ ద్వారా ఎన్నో వార్తలను.. నెటిజన్లు క్షణాల్లో అందుకుంటున్నారని, దీంతో.. యూట్యూబ్‌ని మరింత నమ్మదగినదిగా తీర్చిదిద్దాలని గూగుల్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అందుకు గత కొన్నేళ్లుగా కసరత్తులు కూడా చేస్తూ వచ్చింది. కాగా ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఎన్నికల ప్రకటనలను నిషేధించారు.

Published On - 2:20 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu