యోగా… ప్రపంచానికి భారత్​ ఇచ్చిన పెద్ద గిఫ్ట్..

యోగా… ప్రపంచానికి భారత్​ ఇచ్చిన పెద్ద గిఫ్టుగా అభివ‌ర్ణించాలి. బాడీలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా కీల‌క భూమిక పోషిస్తోంది. స‌నాత‌నకాలం నుంచి భారత సంప్రదాయంలోనే యోగా ఇమిడి ఉంది . ఒకానొక స‌మయంలో భార‌త్ లో యోగా అనునిత్యం విరాజిల్లింది. మ‌న పూర్వీకులు శారీర‌క స‌మ‌స్య‌లు దూరం చెయ్య‌డానికి, మాన‌సికంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండ‌టానికి యోగా చేసేవారు. ఆ త‌ర్వాతికాలంలో పెరిగిన ప‌ని ఒత్తిడి నేపథ్యంలో క్ర‌మ‌క్ర‌మంగా యోగాను మ‌నవాళ్లు దూరం పెట్టారు. […]

యోగా... ప్రపంచానికి భారత్​ ఇచ్చిన పెద్ద గిఫ్ట్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 21, 2020 | 9:28 AM

యోగా… ప్రపంచానికి భారత్​ ఇచ్చిన పెద్ద గిఫ్టుగా అభివ‌ర్ణించాలి. బాడీలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా కీల‌క భూమిక పోషిస్తోంది. స‌నాత‌నకాలం నుంచి భారత సంప్రదాయంలోనే యోగా ఇమిడి ఉంది . ఒకానొక స‌మయంలో భార‌త్ లో యోగా అనునిత్యం విరాజిల్లింది. మ‌న పూర్వీకులు శారీర‌క స‌మ‌స్య‌లు దూరం చెయ్య‌డానికి, మాన‌సికంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండ‌టానికి యోగా చేసేవారు. ఆ త‌ర్వాతికాలంలో పెరిగిన ప‌ని ఒత్తిడి నేపథ్యంలో క్ర‌మ‌క్ర‌మంగా యోగాను మ‌నవాళ్లు దూరం పెట్టారు. అస‌లు ఒత్తిడి త‌గ్గించే సాధకం అదే అన్న విష‌యాన్ని మ‌ర్చిపోయారు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ప‌రిస్థితులు మారిపోయారు. యోగా ప్రాముఖ్య‌త జ‌నాల్లోకి బాగా వెళ్తోంది. పీఎం మోదీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు యోగా ప్ర‌యోజ‌నాలు ప్ర‌జ‌ల‌కు ప‌లు వేదిక‌ల‌పై వివ‌రిస్తున్నారు.

పురాత‌న కాలంలో యోగులు, మునులు, యతులు, రుషులు.. తమ తపోనిష్ట స‌మయంలో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు ‘యోగా’ పాఠాలుగా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త‌, శారీర‌క స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, అధ్మాత్మికానుభూతి…ఈ మూడింటి క‌ల‌బోత యోగానే. జీవనశైలిలో ఎన్నిహైటెక్ వసతులు, పోకడలు భాగమైనా ప్రాచీన యోగా పద్ధతులతోనే ఫలితాలు సాధిస్తున్నారు చాలా మంది. 2015లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది. వివిధ దేశాలు‌, నగరాలు, పట్టణాల నుంచి పల్లెల వరకూ యోగా విస్త‌రించిందంటే..దాని వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉండి ఉండాలి. ఇక ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక యోగా సాధనలు, ప్రదర్శనలు కాకుండా ఎవరికి వారు ఇంట్లోనే సాధన చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచ‌న‌లు చేసింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..