చంద్రబాబుకు పిచ్చి.. కన్‌ఫర్మ్ చేసిందీయనే..

‘‘ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మతిభ్రమించింది… ఆయన్ని వెంటనే పిచ్ఛాసుపత్రికి తరలించి, తగిన చికిత్స ఇప్పించాలి‘‘ ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లివి. ఏపీలో వైసీపీ-టీడీపీ మద్య పెరుగుతున్న మాటల యుద్దానికీ కామెంట్లు నిదర్శనం. గత ఆరునెలలుగా వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వున్నా.. ఇటీవల మూడు రాజధానుల ప్రకటన తర్వాత రెండు పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ […]

  • Rajesh Sharma
  • Publish Date - 5:02 pm, Wed, 1 January 20
చంద్రబాబుకు పిచ్చి.. కన్‌ఫర్మ్ చేసిందీయనే..

‘‘ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మతిభ్రమించింది… ఆయన్ని వెంటనే పిచ్ఛాసుపత్రికి తరలించి, తగిన చికిత్స ఇప్పించాలి‘‘ ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లివి. ఏపీలో వైసీపీ-టీడీపీ మద్య పెరుగుతున్న మాటల యుద్దానికీ కామెంట్లు నిదర్శనం. గత ఆరునెలలుగా వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వున్నా.. ఇటీవల మూడు రాజధానుల ప్రకటన తర్వాత రెండు పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ రాజా మంగళవారం చంద్రబాబుపై ఘాటైన, పదునైన కామెంట్లు చేశారు. చంద్రబాబు కలలు కన్నా.. కనకపోయినా 2019 తర్వాత 2020 వస్తుందని రాజా వ్యంగ్యంగా కామెంట్ చేశారు. తాను అధికారంలో లేకపోవడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్ట పోయిందనుకుని మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాజా అన్నారు. చంద్రబాబును వెంటనే పిచ్చాసుపత్రిలో చేరిస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చిత్తశుద్ది వుంటే జగన్ బావుండాలని పూజలు చేయించాలని రాజా సూచించారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అమరావతిలో ఓవర్ యాక్షన్ చేశారని, అయినా ప్రజలు పవన్ కల్యాణ్‌ని నమ్మే పరిస్థితి లేదని రాజా అన్నారు.