KGF Yash: మాల్దీవుల్లో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతోన్న రాఖీ భాయ్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు..

Yash Maldives Tour: కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా యావత్‌ భారతీయ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు కన్నడ హీరో యష్‌. ఈ సినిమాలో రాఖీ భాయ్‌గా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు...

KGF Yash: మాల్దీవుల్లో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతోన్న రాఖీ భాయ్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు..
Follow us

|

Updated on: Jan 19, 2021 | 11:35 AM

Yash Maldives Tour: కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా యావత్‌ భారతీయ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు కన్నడ హీరో యష్‌. ఈ సినిమాలో రాఖీ భాయ్‌గా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం కేజీఎఫ్‌ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న అప్‌డేట్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల్లో కండలు తిరిగిన హీరోగా కనిపించే యష్‌ నిజ జీవితంలో మాత్రం మంచి ఫ్యామిలి మెన్‌గా ఉంటాడు. కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే యష్‌.. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ యంగ్‌ హీరో ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. భార్య, ఇద్దరు పిల్లలతో మాల్దీవుల్లో రాఖీ భాయ్‌ హల్చల్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ టూర్‌కు సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన యష్‌.. వాటితో పాటు ‘ఒకవేళ స్వర్గమంటూ ఉంటే.. ఇలాగే ఉంటుంది. మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం’ (మాల్దీవులను ఉద్దేశిస్తూ) అనే క్యాప్షన్‌ జోడించాడు.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

Also Read: Priyamani: లాక్‌డౌన్ సమయం దేవుడిచ్చిన వరంలా అనిపించింది.. గత సంవత్సర మధుర స్మృతులను తలుచుకుంటున్న..