కశ్మీర్ పాకిస్థాన్‌దేనట.. పరోక్షంగా ప్రకటించిన చైనా..!

డ్రాగన్ మరోసారి తన కుట్రను బయటపెట్టింది. గత కోద్ది రోజులుగా అంతర్జాతీయంగా వేదికపై చర్చనీయాంశంగా మారిన కశ్మీర్ అంశంపై మళ్లీ పాక్ మాదిరిగానే తానూ విషం కక్కింది. ఇప్పటి వరకు ఈ విషయంలో బహిరంగంగా పాకిస్థాన్‌కు మద్ధతు తెల్పడానికి వెనకాడుతూ వచ్చిన చైనా.. ఇప్పుడు తన స్వరం పెంచింది. కశ్మీర్‌కు సంబంధించి.. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తెలిపారు. ఈ విషయంలో అక్కడ జరుగుతున్న తాజా పరిస్థితులను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ […]

కశ్మీర్ పాకిస్థాన్‌దేనట.. పరోక్షంగా ప్రకటించిన చైనా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 09, 2019 | 6:38 PM

డ్రాగన్ మరోసారి తన కుట్రను బయటపెట్టింది. గత కోద్ది రోజులుగా అంతర్జాతీయంగా వేదికపై చర్చనీయాంశంగా మారిన కశ్మీర్ అంశంపై మళ్లీ పాక్ మాదిరిగానే తానూ విషం కక్కింది. ఇప్పటి వరకు ఈ విషయంలో బహిరంగంగా పాకిస్థాన్‌కు మద్ధతు తెల్పడానికి వెనకాడుతూ వచ్చిన చైనా.. ఇప్పుడు తన స్వరం పెంచింది.

కశ్మీర్‌కు సంబంధించి.. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తెలిపారు. ఈ విషయంలో అక్కడ జరుగుతున్న తాజా పరిస్థితులను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు వివరించారని.. ఈ విషయంలో తమ మద్దతు పాకిస్థాన్‌కే ఉంటుందని పేర్కొన్నారు. బీజింగ్‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ను క‌లిసిన త‌ర్వాత జీ జిన్‌పింగ్ క‌శ్మీర్‌పై త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా, క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ఇరు దేశాలు శాంతియుతంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ం డైలాగ్‌లు కొట్టారు. గత ఆగస్ట్ 5న జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిగా ఉన్న ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. మ‌రోవైపు ఈవారమే భారత్‌లో జీ జిన్‌పింగ్ పర్యటించనున్నారు. చెన్నైలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇరు దేశాధినేతలు అక్కడ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అయితే తాజాగా జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలపై.. ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!