ధోనిని దింపేశాడు..సాహా రనౌట్‌ చేసిన విధానంపై నెటిజన్ల రియాక్షన్..క్రికెట్ ఆస్ట్రేలియా ఏం ట్వీట్ చేసిందంటే?

ఆస్ట్రేలియాతో జరిగిన  పింక్‌ బాల్‌ టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. భారత్ ఈ తరహాలో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ధోనిని దింపేశాడు..సాహా రనౌట్‌ చేసిన విధానంపై నెటిజన్ల రియాక్షన్..క్రికెట్ ఆస్ట్రేలియా ఏం ట్వీట్ చేసిందంటే?
Ram Naramaneni

|

Dec 20, 2020 | 3:16 PM

Ind vs Aus 1st Test : ఆస్ట్రేలియాతో జరిగిన  పింక్‌ బాల్‌ టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. భారత్ ఈ తరహాలో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియా‌ రెండో ఇన్నింగ్స్‌లో 36/9కే కుప్పకూలగా ఆసీస్‌ ఓపెనర్లు ఛేజింగ్‌కు దిగారు. కాగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ను వృద్ధిమాన్‌ సాహా రనౌట్‌ చేసిన విధానం క్రీడా అభిమానులను ఆకట్టుకుంది. టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్‌ ధోనిని గుర్తుకుతెస్తుంది.

అశ్విన్‌ వేసిన 18వ ఓవర్‌ సెకండ్ బాల్‌కు ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి వేడ్‌ ఔటయ్యాడు. బాల్ అతడి బ్యాట్‌కు తగిలి సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పృథ్వీషా కాళ్లకు తాకింది. ఆ విషయాన్ని గుర్తించకుండా కాస్త ముందుకు వెళ్లిన మాథ్యూవేడ్‌ను సాహా ఊహించని విధంగా ఔట్‌ చేశాడు. బంతి పృథ్వీషా కాళ్లకు తగిలి తనవైపు రావడంతో వెంటనే దాన్ని అందుకొని వెనక్కి తిరిగే బంతిని వికెట్లపైకి విసిరాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్‌ రనౌటయ్యాడు. ఇది అచ్చం ధోనీ చేసే రనౌట్‌ మాదిరి ఉంది. ఇదే విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో  ప్రస్తావించింది.  ‘ అలర్ట్‌.. సాహా నుంచి వచ్చిన ఈ సిగ్నల్‌ దేనిని సూచిస్తుందో చెప్పగలరా..’ అంటూ  ట్యాగ్ లైన్ పెట్టింది.  కాగా భారత్-ఆసిస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26న మొదలుకానుంది.

Aso Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu