అస్తమించిన ప్రపంచ కుర వృద్దుడు.. తన ఆయుష్షు సీక్రెట్స్ చెప్పేశాడు..!!

ప్రపంచంలోనే అత్యంత కుర వృద్దుడిగా రికార్డుల్లోకెక్కిన జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె ఇకలేరు. ఆయన వయస్సు 112 సంవత్సరాలు. ఈయన గురించి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కింది. 112 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఎంతో ఉత్సాహంగా.. అందరితో నవ్వుతూ కలిసి ఫొటోలు దిగేవాడు. అయితే గతకొద్ది రోజులుగా ఆయన శ్వాస సంబంధింత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో జ్వరం కూడా రావడంతో.. ఆహారాన్ని తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో.. ఆదివారం చిటెట్సు వటనాబె […]

అస్తమించిన ప్రపంచ కుర వృద్దుడు.. తన ఆయుష్షు సీక్రెట్స్ చెప్పేశాడు..!!
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 12:36 AM

ప్రపంచంలోనే అత్యంత కుర వృద్దుడిగా రికార్డుల్లోకెక్కిన జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె ఇకలేరు. ఆయన వయస్సు 112 సంవత్సరాలు. ఈయన గురించి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కింది. 112 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఎంతో ఉత్సాహంగా.. అందరితో నవ్వుతూ కలిసి ఫొటోలు దిగేవాడు. అయితే గతకొద్ది రోజులుగా ఆయన శ్వాస సంబంధింత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో జ్వరం కూడా రావడంతో.. ఆహారాన్ని తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో.. ఆదివారం చిటెట్సు వటనాబె తుదిశ్వాస విడిచినట్లు గిన్నీస్ రికార్డ్ ప్రతినిధులు వెల్లడించారు. కాగా మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తైనట్లు పేర్కొన్నారు. వటనాబేకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. 12 మంది మనవళ్లు, 17 మంది ముని మనవండ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం.. వటనాబె 1907లో నార్త్ జపాన్‌లోని నీగటాలో జన్మించాడు. అగ్రికల్చర్‌ స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన.. అనంతరం తైవాన్‌లోని దాయ్‌-నిప్పన్‌ మెయిజి షుగర్‌ కంపెనీలో కాంట్రాక్టు పనుల్లో పనికి చేరాడు.ఆ తర్వాత మిట్సు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన స్వస్థలాన్ని వదిలి.. యుద్ధం ముగిసిన తర్వాత మళ్లీ స్వస్థలానికి చేరుకుని.. అక్కడే కాలం వెళ్లదీశాడు. అయితే వందేళ్ల దాటినా కూడా ఆయన తన పొలంలో పండ్లు, కూరగాయలు పండిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలిచాడు. ఈ క్రమంలో ఆయన ఆయుష్షుకు సంబంధించిన సీక్రెట్స్‌ను బహిర్గతం చేశాడు. మీరు కూడా నాలా ఆయుష్షు ఎక్కువగా ఉండాలంటే.. ‘ఎప్పుడూ కోపానికి రాకండి. ముఖాలపై ఎప్పుడూ చిరునవ్వును చెరగనీయకండి’ అంటూ చెప్పుకొచ్చాడు.