Narendra Modi: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది… ప్రవాసీ దివాస్ సదస్సులో ప్రధాని మోదీ…

ప్రపంచం మొత్తం భారతదేశం జరిపే టీకా డ్రైవ్ గురించి ఎదురు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 16వ ప్రవాసీ దివాస్ సదస్సులో...

Narendra Modi: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది... ప్రవాసీ దివాస్ సదస్సులో ప్రధాని మోదీ...
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2021 | 9:19 PM

ప్రపంచం మొత్తం భారతదేశం జరిపే టీకా డ్రైవ్ గురించి ఎదురు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 16వ ప్రవాసీ దివాస్ సదస్సులో మాట్లాడుతూ… ప్రపంచ ఫార్మసీ రంగం భారతదేశ టీకా కార్యక్రమాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. దేశ ప్రజలను రక్షించేందుకు దేశీయంగా తయారు చేసిన రెండు కొవిడ్ వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతినిచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారత దేశంలో ఉందని ప్రధాని అన్నారు. ఇక్కడ ఆ వ్యవస్థ బలంగా ఉందని తెలిపారు.

బ్రాండ్ ఇండియా…

దేశీయంగా తయారైన వస్తువులనే ఉపయోగించాలని ప్రధాని మోదీ భారతీయ ప్రవాసులను కోరారు. తద్వారా స్వదేశీ ఉద్యమానికి, స్థానిక వ్యాపారులకు ప్రోత్సాహం లభించినట్లువుతుందని అన్నారు. కాగా కరోనా టీకా డ్రైవ్ జనవరి 16న ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా స్ట్రెయిన్ వైరస్ బారిన 90 మంది పడినట్లు ప్రధాని ప్రకటించారు. భారతదేశం 24 గంటల్లో 18,222 తాజా కరోనా వైరస్ కేసులు వచ్చాయని అన్నారు. దేశీయ తయారీదారుల స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు బ్రాండ్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అతి తక్కువ మరణాల రేటు, అత్యధిక రికవరీ రేటు ఉన్న దేశాలలో దేశం ఒకటన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.

ఔషధాల తయారీలో…

ఔషధాల తయారీలో భారత్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు భారతీయ వ్యాక్సిన్ల కోసం వేచి ఉండటమే కాదు, భారతదేశం అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని ఎలా చేపట్టబోతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ఫార్మా, వైద్య సేవల్లో భారత్ చాలా ముందు స్థానంలో ఉందని అన్నారు. పీఎం కేర్ ఫండ్స్‌కు సాయం చేసిన వారికి ప్రధాని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అవినీతిని అంతం చేసేందుకు భారత్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని, కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నామని వివరించారు.

దేశంలో అక్షరాస్యత పెరిగిందని, పేదరికం తగ్గుతోందని ప్రధాని అన్నారు. అంతేకాకుండా దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని తెలిపారు. మహమ్మారి సమయంలో ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా 45 లక్షల మంది ప్రవాసీలను స్వదేశానికి తీసుకొచ్చిందని వివరించారు.