టెన్నిస్ క్రీడలో ఓ పెద్ద మార్పు.. ఇక వారు కనిపించరు

టెన్నిస్‌ క్రీడలో ఓ పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. టెన్నిస్​లో ప్రధాన అంపైర్లతో పాటు లైన్​ అంపైర్లూ చాలా కీలకం. వారి నిర్ణయాలతో ఒక్కోసారి మ్యాచ్​ ఫలితాలే మారిపోతుంటాయి. అయితే ఇకపై వీరి స్థానాన్ని టెక్నాలజీతో భర్తీ చేస్తూ..

  • Sanjay Kasula
  • Publish Date - 3:38 pm, Tue, 15 September 20
టెన్నిస్ క్రీడలో ఓ పెద్ద మార్పు.. ఇక వారు కనిపించరు

టెన్నిస్‌ క్రీడలో ఓ పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. టెన్నిస్​లో ప్రధాన అంపైర్లతో పాటు లైన్​ అంపైర్లూ చాలా కీలకం. వారి నిర్ణయాలతో ఒక్కోసారి మ్యాచ్​ ఫలితాలే మారిపోతుంటాయి. అయితే ఇకపై వీరి స్థానాన్ని టెక్నాలజీతో భర్తీ చేస్తూ.. టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో హాక్​-ఐ టెక్నాలజీ వాడనున్నారు.

వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగిన జకోవిచ్.. కోపంతో వెనక్కి విసిరిన బంతి అక్కడే ఉన్న లైన్ అంపైర్ గొంతు సమీపంలో బలంగా తాకింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు.

స్పెయిన్ ఆటగాడు కరేనో బుస్తాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో వరుస సెట్ పాయింట్లను కోల్పోయిన జకోవిచ్.. బంతిని బలంగా విసరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో నాలుగోసారి యూఎస్ ఓపెన్ గెలవాలన్న జకోవిచ్ ఆశలకు బ్రేక్ పడింది. ఈ ఘటనే ఓ పెద్ద మార్పుకు కారణంగా మారింది.

లైన్​ అంపైర్​ను అనుకోకుండా బంతితో కొట్టడం వల్ల జొకోవిచ్‌పై వేటు పడింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకపోవచ్చు. ఎందుకంటే టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇక లైన్‌ అంపైర్లే కనపడరు. యూఎస్‌ ఓపెన్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘ఎలక్ట్రానిక్‌ లైన్‌ కాలింగ్’‌ విధానం విజయవంతం కావడమే దానికి కారణం.