పాతికేళ్లకే గుండెకి తూట్లు .. నేడు వరల్డ్‌ హార్ట్‌ డే..

పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 25–40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో గుండెపోట్లు అధికంగా వస్తున్నాయని తాజా అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. 1990 నుంచి 2016 మధ్య కాలంలో భారత్‌లో గుండె జబ్బులు 50 శాతం పెరిగాయి. భారత్‌లో ఏటా సంభవించే మరణాల్లో 17 శాతం గుండె జబ్బుల కారణంగా జరిగేవే. దేశంలో 80 లక్షల నుంచి కోటి మంది గుండెపోటు రోగులున్నారు. ఇది ప్రపంచంలో 40 శాతానికి సమానం. మరో ముఖ్యమైన […]

పాతికేళ్లకే గుండెకి తూట్లు .. నేడు వరల్డ్‌ హార్ట్‌ డే..
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 8:50 AM

పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 25–40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో గుండెపోట్లు అధికంగా వస్తున్నాయని తాజా అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. 1990 నుంచి 2016 మధ్య కాలంలో భారత్‌లో గుండె జబ్బులు 50 శాతం పెరిగాయి. భారత్‌లో ఏటా సంభవించే మరణాల్లో 17 శాతం గుండె జబ్బుల కారణంగా జరిగేవే. దేశంలో 80 లక్షల నుంచి కోటి మంది గుండెపోటు రోగులున్నారు. ఇది ప్రపంచంలో 40 శాతానికి సమానం. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే 2000 సంవత్సరం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండె జబ్బులు, గుండెపోట్లు ఎక్కువ అవుతూ ఉండటం.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో పల్లెలకూ ఓ విధమైన పట్టణ సంస్కృతి పాకింది. నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో పొగరాయుళ్లు ఎక్కువ. అందుకే పల్లెల్లో కూడా గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. గ్రామీణ భారతంలో గుండె జబ్బులు పురుషుల్లో 40 శాతం, మహిళల్లో 56 శాతం వరకూ ఎక్కువైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులతో వచ్చే మరణాలు తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో అధికంగా ఉంటే, గుండెపోట్లు వచ్చి మరణించేవారు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ. భారత్‌ ఇప్పటికే మధుమేహ వ్యాధిలో ప్రపంచ దేశాలకు రాజధానిగా మారింది. షుగర్‌ వ్యాధి హార్ట్‌ ఫెయిల్యూర్‌కి దారితీస్తూ భారత్‌లో గుండె వ్యాధిగ్రస్తుల సంఖ్యను పెంచేస్తోంది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??