Women’s World Cup 2022: విజయానికి 6 బంతుల్లో 6 పరుగులు.. ఉత్కంఠ మ్యాచులో అదరగొట్టిన వెస్టిండీస్.. కివీస్ ఘోర పరాజయం..

ICC Women’s World Cup 2022, NZW vs WIW: మ్యాచ్ చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 3 వికెట్లు ఉన్నా.. 6 పరుగులు చేయడంలో విఫలమైంది.

Women’s World Cup 2022: విజయానికి 6 బంతుల్లో 6 పరుగులు.. ఉత్కంఠ మ్యాచులో అదరగొట్టిన వెస్టిండీస్.. కివీస్ ఘోర పరాజయం..
Icc Women’s World Cup 2022, Nzw Vs Wiw
Follow us

|

Updated on: Mar 04, 2022 | 3:12 PM

ICC Women’s World Cup 2022, NZW vs WIW: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. చివరి 6 బంతుల్లో అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నారు. వాస్తవానికి, మ్యాచ్ చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు కావాలి. చేతిలో 3 వికెట్లు ఉన్నప్పటికీ 6 పరుగులు చేయడంలో విఫలమైంది. కివీస్ జట్టు మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. తద్వారా 12వ ఎడిషన్‌ టోర్నీ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయం సాధించింది. వెస్టిండీస్ సాధించిన ఈ విజయంలో బంతి, బ్యాటింగ్‌తో అద్భుతాలు చేసిన హేలీ మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన హేలీ మాథ్యూస్ బ్యాటింగ్‌తో 128 బంతుల్లో 119 పరుగులు చేసింది. ఇది మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆమెకు తొలి సెంచరీ. ఆ తర్వాత బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసి 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది.

6 బంతుల్లో మారిపోయిన న్యూజిలాండ్ కథ.. న్యూజిలాండ్ తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన దియాండ్రా డోటిన్.. ఆ ఓవర్ తొలి బంతికే పరుగు ఇచ్చింది. దాంతో న్యూజిలాండ్ 5 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే తర్వాతి బంతికే వికెట్ పడింది. కేట్ మార్టిన్‌ను అవుట్ చేయడం ద్వారా కివీ జట్టుకు డోటిన్ 8వ వికెట్‌ను పడగొట్టింది.

ఆ తరువాత న్యూజిలాండ్‌కు 4 బంతుల్లో 5 పరుగులు చేయడం సవాల్‌గా మారింది. డాటిన్ వేసిన మూడో బంతికి న్యూజిలాండ్ మళ్లీ ఒక్క పరుగు తీసింది. ఆ తరువాత 3 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, తర్వాతి బంతికే న్యూజిలాండ్‌కు తొమ్మిదో దెబ్బ తగిలింది. అనంతరం 2 బంతులల్లో 4 పరుగులుగా మారింది. కానీ, పరుగులు తీయాలనే హడావుడిలో కివీస్‌ జట్టు చివరి వికెట్‌ కూడా చేజారింది. ఫ్రాన్ జోనాస్ రనౌట్ అయింది. ఇక, ఈ ఉత్కంఠ మ్యాచ్‌ వెస్టిండీస్‌ బ్యాగ్‌లో పడింది.

రెండు జట్ల XI ప్లేయింగ్..

న్యూజిలాండ్ XI: సుజీ బేట్స్, సోఫియా డివైన్, అమేలియా కెర్, అమీ సాటర్త్‌వైట్, మాడ్డీ గ్రీన్, బ్రూకీ హాలీడే, కేటీ మార్టిన్, లీ టహుహు, జెస్ కెర్, హన్నా రోవ్, ఫ్రాన్ జోన్స్

వెస్టిండీస్ XI: డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్, కాసియా నైట్, స్టెఫానీ టేలర్, షిమనే కాంప్‌బెల్, చాడియన్ నేషన్, చానెల్ హెన్రీ, ఆలియా అలెన్, అనిస్సా మహ్మద్, షకేరా సెల్మాన్, షామిలియా కానెల్

Also Read: IPL 2022 Promo: ఐపీఎల్ ప్రోమో వచ్చేసిందోచ్.. మాస్ లుక్‌లో అదరగొట్టిన తలా

IND vs SL: కోహ్లీ ఖాతాలో మరో స్పెషల్ రికార్డు.. ఆ లిస్టులో చేరిన ఆరో భారత బ్యాట్స్‌మెన్స్..

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!