స్నేహితురాలి భర్తతో ఎఫైర్..ఆపై ఆమె గొంతు కోసి..

 అక్రమ సంబంధానికి అడ్డంకిగా ఉన్న తన ప్రేమికుడి భార్యపై ఒక మహిళ దాడి చేసింది. వివరాల్లోకి వెళితే, మునియమ్మల్ అనే మహిళ చెన్నైలోని కొడుంగైయూర్‌‌లో తన భర్తతో కలిసి నివాసంముంటుంది. కాగా నుంగంబాక్కంకు చెందిన ప్రియా,  మునియమ్మల్‌కు మంచి స్నేహితురాలు. దీంతో ప్రియా తరచుగా మునియమ్మల్ ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ప్రియాకు తన స్నేహితురాలి భర్త కార్తీక్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. కొంతకాలం గుట్టుగానే నడిచిన వీరి […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:18 pm, Mon, 2 December 19
స్నేహితురాలి భర్తతో ఎఫైర్..ఆపై ఆమె గొంతు కోసి..

 అక్రమ సంబంధానికి అడ్డంకిగా ఉన్న తన ప్రేమికుడి భార్యపై ఒక మహిళ దాడి చేసింది. వివరాల్లోకి వెళితే, మునియమ్మల్ అనే మహిళ చెన్నైలోని కొడుంగైయూర్‌‌లో తన భర్తతో కలిసి నివాసంముంటుంది. కాగా నుంగంబాక్కంకు చెందిన ప్రియా,  మునియమ్మల్‌కు మంచి స్నేహితురాలు. దీంతో ప్రియా తరచుగా మునియమ్మల్ ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ప్రియాకు తన స్నేహితురాలి భర్త కార్తీక్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. కొంతకాలం గుట్టుగానే నడిచిన వీరి వ్యవహారం మునియమ్మల్‌కు తెలియడంతో ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. భార్య నుండి హెచ్చరిక అందుకున్న కార్తీక్ తన ప్రేయసిని కలవడం మానేశాడు. దీంతో ప్రియా తన అక్రమ సంబంధంలో జోక్యం చేసుకుంటున్నందున మునియమ్మల్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది.

మునియమ్మల్ ఆమె భర్త‌తో కలిసి శుక్రవారం రాత్రి కోయంబత్తూర్ బస్ స్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా, ప్రియా అక్కడికి చేరుకుని తీవ్ర వాగ్వాదానికి దిగింది. తరువాత దాడి చేసి కత్తితో ఆమె గొంతు కోసింది. దాడిలో, మునియమ్మల్ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని కిల్‌పక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలు ప్రియాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.