ఆ జ్యూవెలరీ స్టోర్‌లో.. ఒక్కరి నుంచి 104 మందికి కరోనా..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని

ఆ జ్యూవెలరీ స్టోర్‌లో.. ఒక్కరి నుంచి 104 మందికి కరోనా..!
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 5:23 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని(ఎన్‌ఎస్‌బీ రోడ్) ఓ జ్యూవెలరీ స్టోర్ కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ఆ స్టోర్‌లో పనిచేసే ఓ వ్యక్తి జూన్ 22న కరోనా బారిన పడ్డాడు. మొత్తం ఆ స్టోర్‌లో పనిచేసే 303 మంది వర్కర్లు, అతనితో కలిసి ఉండే 32 మంది కరోనా భయంతో టెస్టులు చేయించుకున్నారు. వారి భయమే నిజమైంది. వారిలో 104 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కాగా.. ఆ ఒక్క వ్యక్తి వల్ల 104 మందికి కరోనా సోకినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అతనికి కరోనా సోకినట్లు తెలిసిన వెంటనే ఐసోలేషన్‌లో ఉంచామని, అంతమందికి సోకుతుందని తొలుత భావించలేదని జిల్లా అధికారి తెలిపారు. అయితే.. వారం రోజుల వ్యవధిలో ఆ జ్యూవెలరీ స్టోర్‌లో అతనితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో 104 మందికి కరోనా సోకినట్లు తెలిసిందని చెప్పారు. తిరుచ్చిలోని ఆ జ్యూవెలరీ స్టోర్‌ను 2 వారాల పాటు మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.