కరోనా సంక్షోభ సమయంలో.. ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు: విప్రో

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా సంభవించిన నష్టాలను ఎదుర్కోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు

కరోనా సంక్షోభ సమయంలో.. ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు: విప్రో
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 1:09 AM

Wipro has no plans of firing: దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా సంభవించిన నష్టాలను ఎదుర్కోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి. అయితే కరోనా కారణంగా తమ సంస్థలో ఎటువంటి ఉద్యోగాల కోతలు విధించలేదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు.

కరోనా సంక్షోభ సమయంలో కూడా తమ ఐటీ సంస్థలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని రిషద్ షేర్‌హోల్డర్లకు వివరించారు. అలాగే ఉద్యోగాల్లో ఎటువంటి కోతలు విధించే ఆలోచనా తమకు లేదని స్పష్టంచేశారు. గతేడాది కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రిషద్.. కంపెనీ నష్టాలను ఇతర మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

Also Read: యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు