శీతాకాలంలో కరోనా ముప్పు మరింత అధికమట !

చలికాలంలో కోవిడ్‌ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందే ముప్పుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి వైరస్‌... అన్ని రుతువులను తట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపించింది.

శీతాకాలంలో కరోనా ముప్పు మరింత అధికమట !

చలికాలంలో కోవిడ్‌ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందే ముప్పుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి వైరస్‌… అన్ని రుతువులను తట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపించింది. మే నెెలలో మండే ఎండల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి ఆగలేదు. అయితే మిగతా శ్వాసకోశ వైరస్‌లతో పోల్చితే, శీతాకాలంలో కరోనా వైరస్‌ మరింతగా వ్యాపించే ప్రమాదముందని ఢిల్లీలోని ఫోర్టిస్‌ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణురాలు డా.రిచా సరీన్‌ తెలిపారు.

‘‘చలి, పొడి వాతావరణంలో వైరస్‌ లైఫ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ తగ్గినా కోవిడ్-19 వ్యాప్తి ముప్పు పెరుగుతుంది. శీతాకాలంలో సూర్యరశ్మి సరిగా అందక ప్రజల్లో విటమిన్‌-డి స్థాయులు క్షీణిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది’’ అని ఆమె వివరించారు.  వైరస్ ను ఎదుర్కోడడానికి భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం ప్రధాన అస్త్రాలని రిచా సూచించారు.

Also Read :

దేశంలో కరోనా కలవరం

నంద్యాల: నడిరోడ్డుపై నిండు గర్భిణి దారుణ హత్య