వరదలా ప్రవహించిన రెడ్‌వైన్‌

ఛా..ఛా..ఆ సమయంలో మేము అక్కడ ఎందుకు లేమురా బాబు అనుకుంటారు మందుబాబులు ఈ వార్త చదివితే. అవును మరి అక్కడ సీన్ అలాంటిది.

వరదలా ప్రవహించిన రెడ్‌వైన్‌
Follow us

|

Updated on: Sep 28, 2020 | 8:29 PM

ఛా..ఛా..ఆ సమయంలో మేము అక్కడ ఎందుకు లేమురా బాబు అనుకుంటారు మందుబాబులు ఈ వార్త చదివితే. అవును మరి అక్కడ సీన్ అలాంటిది. గేట్లు ఎత్తితే నీళ్లు ఎలా ప్రవహిస్తాయో,  స్టోర్ చేసిన  ట్యాంక్ పగిలిపోవడంతో రెడ్ వైన్ అలా ప్రవహించింది. స్పెయిన్ లో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రెడ్‌వైన్ అలా ప్రవహిస్తుంటే, ఎంప్లాయిస్ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు.

ఇక ఈ వీడియోకి మందుబాబులు చేస్తోన్న కామెంట్లు మాములుగా లేవు.  ‘మా  జీవితాలకు ఎప్పుడూ ఇలాంటి ఛాన్సు రాదు’. ‘అబ్బా ఒక్క బాటిల్ దొరికినా చాలు బాబు’ అంటూ కామెంట్లు పెట్టసాగారు. దాదాపు 49 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రక్తం లాగా కనిపిస్తుండడం చూసి కొందరు బెంబేేలెత్తిపోతున్నారు. కాగా 1969 నుంచి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయట.

Also Read : ‘నో’ చెప్పలేకపోతే సమస్యలు తప్పవు: పూరీ