ఇక మేమూ స్పందించాం.. అనుమతి పత్రాలలో ప్రధాన అంశాన్ని చూడాలన్న భారత్ బయోటెక్, ప్రజారోగ్యమే తమ ధ్యేయమని వెల్లడి

తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరైనా తీవ్ర అస్వస్థతకు గురైన పక్షంలో వారికి పరిహారం చెల్లిస్తామని భారత్ బయో టెక్ సంస్థ..

ఇక మేమూ స్పందించాం.. అనుమతి పత్రాలలో ప్రధాన అంశాన్ని చూడాలన్న భారత్ బయోటెక్, ప్రజారోగ్యమే తమ ధ్యేయమని వెల్లడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 5:27 PM

తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరైనా తీవ్ర అస్వస్థతకు గురైన పక్షంలో వారికి పరిహారం చెల్లిస్తామని భారత్ బయో టెక్ సంస్థ ప్రకటించింది. అలాగే ప్రభుత్వం నిర్దేశించే సెంటర్లు, లేదా ఆస్పత్రుల్లో వారికి వైద్య చికిత్స లభించేలా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రజారోగ్యమే తమ ధ్యేయమని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ తీసుకువారికి ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల్లో అనుమతి పత్రాలను అందజేస్తున్నారు. ఇది తీసుకున్నవారు అనారోగ్యం బారిన పడిన పక్షంలో ఇందుకు పరిహారాన్ని స్పాన్సర్ (భారత్ బయో టెక్) చెల్లిస్తుందని ఈ పత్రాల్లో పేర్కొంటున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో ఈ విధమైన పత్రాలను ఆయా హెల్త్ కేర్  సిబ్బందికి అందించారు. ఇతర రాష్ట్రాల విషయం తెలియాల్సి ఉంది. ఇలా ఉండగా… బీహార్ లో పారిశుధ్య సిబ్బంది, ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ప్రథములయ్యారు. హెల్త్ కేర్ వర్కర్లలో వీరు కూడా భాగమేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు టీకామందు అన్నది సురక్షితమైనదని, ఏ వ్యాక్సిన్ అన్నా తీసుకోవచ్ఛునని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్  గులేరియా స్పష్టం చేశారు.  అటు- భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టినందుకు హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఇక వ్యాక్సిన్ల విషయంలో అపోహలు వద్దని, అన్ని టీకామందులూ సురక్షితమైనవేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.  వదంతులను నమ్మవద్దన్నారు. శనివారం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వాక్సిన్లు తీసుకున్న కొంతమంది హెల్త్ కేర్ సిబ్బందితో ఆయన ముచ్చటించారు. వీరి సేవలను ప్రశంసించారు.

రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో