కేకే మధ్యవర్తిత్వం వర్కౌట్ అవుతుందా..?

ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గారా..? కార్మికుల సమ్మెకి.. టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావుకి సంబంధమేంటి..? తెలంగాణ ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు.. కేశవరావు ఎందుకు మాట్లాడుతున్నారు..? ఆర్టీసీ కార్మికుల సమ్మెకి.. ప్రభుత్వానికి మధ్య ఆయనెందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో.. సమ్మె ఉదృత రూపం దాల్చింది. పరిస్థితి చేయి దాటి పోయే సమయంలో.. ఆర్టీసీ సమ్మె పై కేకే కలుగజేసుకోవడంతో సమస్య పరిష్కారం పై ఆశలు చిగురించాయి. నిన్నటి […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:42 pm, Tue, 15 October 19
కేకే మధ్యవర్తిత్వం వర్కౌట్ అవుతుందా..?

ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గారా..? కార్మికుల సమ్మెకి.. టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావుకి సంబంధమేంటి..? తెలంగాణ ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు.. కేశవరావు ఎందుకు మాట్లాడుతున్నారు..? ఆర్టీసీ కార్మికుల సమ్మెకి.. ప్రభుత్వానికి మధ్య ఆయనెందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో.. సమ్మె ఉదృత రూపం దాల్చింది. పరిస్థితి చేయి దాటి పోయే సమయంలో.. ఆర్టీసీ సమ్మె పై కేకే కలుగజేసుకోవడంతో సమస్య పరిష్కారం పై ఆశలు చిగురించాయి. నిన్నటి దాకా ఉదృతంగా సాగిన ఆర్టీసీ సమ్మె నేడు చర్చల దారివైపు మళ్లిందా అనిపిస్తోంది. కేకే మధ్య వర్తిత్వానికి జేఏసీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తాము సమ్మె చేస్తున్నామని.. ఆర్టీసీ జేఏసీ చెబుతున్న విషయం తెలిసిందే.. అయితే సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. ఆ సమస్యను పరిష్కరిస్తానని కేకే అంటున్నారు. ఈ నేపథ్యంలో కేకే, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చర్చలు జరిపే ముందు సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు కేకే లేఖ రాశారు. పరిస్థితులు చేయి దాటకముందే.. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించిన ఆయన.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ మినహా సంస్థ మిగతా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల ధోరణిలో ఉందన్నారు. ఆర్టీసీలో 20శాతం ప్రైవేట్ బస్సులు నడపాలనేది ఓ ప్రయోగంలా మాత్రమే భావించాలని లేఖలో పేర్కొన్నారు. ఇక తన మధ్యవర్తిత్వాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించాలని కేకే చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే నడుచుకుంటానని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. మరి కేకే మధ్యవర్తిత్వం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.