జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, రాహుల్!

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. 2024 నాటికి దేశంలో ఎన్నార్సీ పూర్తిచేస్తామన్నారు అమిత్ షా. దేశంలో చొరబడిన విదేశీయులను తరిమేస్తామన్నారు. అటు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివాసీల భూములు లాక్కుంటుందని ఆరోపించారు. దీంతో జార్ఖండ్ లో ప్రచారం ఒక్కసారిగా హీటెక్కింది.  రెండో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మరోవైపు రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన రెండో దశ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:42 am, Tue, 3 December 19
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, రాహుల్!

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. 2024 నాటికి దేశంలో ఎన్నార్సీ పూర్తిచేస్తామన్నారు అమిత్ షా. దేశంలో చొరబడిన విదేశీయులను తరిమేస్తామన్నారు. అటు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివాసీల భూములు లాక్కుంటుందని ఆరోపించారు. దీంతో జార్ఖండ్ లో ప్రచారం ఒక్కసారిగా హీటెక్కింది.  రెండో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మరోవైపు రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. అయోధ్య తీర్పు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు అమిత్ షా. జార్ఖండ్ ప్రజలను బీజేపీ భయభ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు రాహుల్.