కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు.. మంటల్లో మూగజీవాలు..

యూఎస్ లోని కాలిఫోర్నియా రాష్ట్రం సోలానో కౌంటీలోని అడ‌విలో కార్చిచ్చు చెలరేగింది. దీంతో 1,800 ఎకరాలకు ఈ మంట‌లు విస్త‌రించాయి. జూన్ 6న ప్రారంభ‌మైన ఈ క్వాయిల్ ఫైర్ కేవ‌లం ఒకే రోజులో 1,800 ఎక‌రాల‌ను కాల్చి బూడిద చేసింది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:17 pm, Tue, 9 June 20
కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు.. మంటల్లో మూగజీవాలు..

యూఎస్ లోని కాలిఫోర్నియా రాష్ట్రం సోలానో కౌంటీలోని అడ‌విలో కార్చిచ్చు చెలరేగింది. దీంతో 1,800 ఎకరాలకు ఈ మంట‌లు విస్త‌రించాయి. జూన్ 6న ప్రారంభ‌మైన ఈ క్వాయిల్ ఫైర్ కేవ‌లం ఒకే రోజులో 1,800 ఎక‌రాల‌ను కాల్చి బూడిద చేసింది. దీంతో అగ్నిమాపక రక్షణకు బాధ్యత వహిస్తున్న కాలిఫోర్నియా ఏజెన్సీ 600 మంది సిబ్బందిని, 30 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపింది. ఇప్పటివరకు అగ్నిమాప‌క సిబ్బంది 40 శాతం మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, భారీ మొత్తంలో అడవిలోని జంతుజాలం ఈ మంట‌ల్లో చిక్కుకుని ప్రాణాలొదిలి ఉంటాయని అట‌వీశాఖ అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ