ఆ పార్టీలో వాళ్లిద్దరూ ఎందుకు సైలెంటయ్యారు?

రోజా, వాసిరెడ్డి పద్మ… వీరిద్దరూ చాలాకాలం పార్టీకి ప్రధానమైన గొంతుకగా ఉన్నారు. వారు మీడియాతో మాట్లాడినా – టీవీ డిబేట్లలో పాల్గొన్నా రాష్ట్రమంతా వినేది. కానీ ఈ ఇద్దరి గొంతూ కొన్నాళ్లుగా వినిపించడం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రధాన గళాలు నెమ్మదించడంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. వారిని ఎదుర్కోవడం ఇతర పార్టీల నాయకులకు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ తరఫున ప్రస్తుతం డిబేట్లలో పాల్గొంటున్నవారు ఇతర […]

ఆ పార్టీలో వాళ్లిద్దరూ ఎందుకు సైలెంటయ్యారు?
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 9:48 PM

రోజా, వాసిరెడ్డి పద్మ… వీరిద్దరూ చాలాకాలం పార్టీకి ప్రధానమైన గొంతుకగా ఉన్నారు. వారు మీడియాతో మాట్లాడినా – టీవీ డిబేట్లలో పాల్గొన్నా రాష్ట్రమంతా వినేది. కానీ ఈ ఇద్దరి గొంతూ కొన్నాళ్లుగా వినిపించడం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రధాన గళాలు నెమ్మదించడంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. వారిని ఎదుర్కోవడం ఇతర పార్టీల నాయకులకు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ తరఫున ప్రస్తుతం డిబేట్లలో పాల్గొంటున్నవారు ఇతర పార్టీల నాయకులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు.

రోజా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో కొద్దిరోజులు ఆమె అసంతృప్తి చెందారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఆమెకు ఏపీఐఐసీ పదవిని జగన్ కట్టబెట్టారు. అయినప్పటికీ ఆమె ఎందుకో మునుపటిలా యాక్టివ్ గా లేరు. పెద్దగా మీడియాతో మాట్లాడడం లేదు.

ఇక వాసిరెడ్డి పద్మకు ఇటీవలే మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్. ఆమె ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ ఈ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎమ్మెల్సీ పదవికి ముందే జగన్ కు కమిట్ మెంట్లు ఉండడం.. మంత్రివర్గంలోకి తీసుకున్న మోపిదేవి వంటివారికి ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉండడంతో వాసిరెడ్డి పద్మ పరిస్థితులను అర్థం చేసుకున్నారనే చెబుతున్నారు. అయితే మహిళా కమిషన్ చైర్మన్ పదవిలోకి వచ్చిన తరువాత కూడా ఆమె యాక్టివ్ గా లేరు.

రోజా – పద్మలు యాక్టివేట్ అయితేనే వైసీపీ ప్రస్తుతం బాలారిస్టాలను కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ అధికార ప్రతినిధులు టీడీపీ నేతలను డిబేట్లలో ఎదుర్కోలేకపోతున్నారు. టీడీపీకి నాలెడ్జ్ సెంటర్ ఉండడంతో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సమాచారం అందుతుంటుంది. కానీ వైసీపీకి అలాంటి వ్యవస్థ లేదు. నాయకులే హోం వర్క్ చేసి సరైన సమాచారంతో తమ వాదనలు వినిపించాలి. అందరిలో ఈ సామర్థ్యం లేకపోవడంతో విఫలమవుతున్నారు. దీంతో ఈ పరిస్తితుల్లో వాసిరెడ్డి పద్మ – రోజాలు మళ్లీ తమ వాయిస్ వినిపిస్తేనే బెటరని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..