నేపాల్‌తో చైనా స్నేహం ఏంటి..!

1962లో భారత్‌తో ఎప్పుడైతే యుద్ధం చేసిందో.. అప్పటి నుంచి మన దేశ సరిహద్దు దేశాల మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టింది చైనా. భారత్‌తో సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు(బంగ్లాదేశ్ అప్పటికి ఇంకా స్వాతంత్య్రాన్ని పొందలేదు) వంటి దేశాలతో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది చైనా. దీని వలన భారత్ మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు.. మన దేశ ప్రతిష్టను తగ్గించడం కోసం తీవ్ర ప్రయత్నాలను చేస్తూ వచ్చింది. ఇక భారత్‌లో పర్యటన […]

నేపాల్‌తో చైనా స్నేహం ఏంటి..!
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2019 | 1:42 PM

1962లో భారత్‌తో ఎప్పుడైతే యుద్ధం చేసిందో.. అప్పటి నుంచి మన దేశ సరిహద్దు దేశాల మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టింది చైనా. భారత్‌తో సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు(బంగ్లాదేశ్ అప్పటికి ఇంకా స్వాతంత్య్రాన్ని పొందలేదు) వంటి దేశాలతో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది చైనా. దీని వలన భారత్ మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు.. మన దేశ ప్రతిష్టను తగ్గించడం కోసం తీవ్ర ప్రయత్నాలను చేస్తూ వచ్చింది.

ఇక భారత్‌లో పర్యటన ముగిస్తూనే జిన్ పింగ్‌ నేపాల్‌‌కు వెళ్లారు. అక్కడ ఓ రోజంతా గడిపిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు టిబెట్ రాజధాని లూసా నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌కు తాము నిర్మించబోయే ‘హిమాయలన్ ట్రైన్ రోడ్’ గురించి ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీతో చర్చించారు. దీని వెనుకాల చైనా ఉద్దేశ్యం.. భారత్‌తో నేపాల్‌కు సంబంధం తగ్గించడమేనని తెలుస్తోంది. కాగా నేపాల్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోవడం కోసం భారత్ కూడా పలు ప్రయత్నాలు చేస్తోంది. నేపాలీవాసులకు ఇక్కడ నివసించేందుకు కొన్ని ప్రత్యేక అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో లక్షలాదిమంది నేపాలియన్లు భారత్‌లో ఇప్పటికీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ నివసిస్తున్నారు. అంతేకాదు ఇక్కడి నుంచి ఎన్నో వస్తువులు, ఆహార పదార్ధాలు నేపాల్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఇలా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చైనా కూడా నేపాల్‌పై తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.

ఇక ఇటీవల మోదీని జిన్‌ పింగ్ కలవడానికి పెద్ద కారణం ఏంటంటే.. భారత్, చైనా దేశాలకు ఒకరి అవసరం మరొకరికి ఉంది. అంతేకాదు భారత్‌తో సంబంధాలు వదులుకునేందుకు చైనా ఏ మాత్రం సిద్ధంగా లేదన్నది సరిహద్దు దేశాలకు అర్థమైంది. అలాగే పాకిస్తాన్‌కు చైనా లోపాయికారిగా ఎన్ని సహాయాలు చేసినా.. రహస్యంగా ఎంత రెచ్చగొట్టినా.. భారత్‌తో మాత్రం విరోధం పెట్టుకునేందుకు సిద్ధంగా లేదని ఆ దేశానికి ఓ చక్కటి సందేశాన్నిఇచ్చింది. ఇక ఇప్పుడు భారత్ కూడా ఏం చేయాలంటే చైనాతో సంబంధాలు పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. ఈ నేపథ్యంలో చైనా ఎక్కడైతే సహాయం చేస్తుందో.. దానికి మనం అడ్డం లేకుండా.. ఆ సహాయాన్ని స్వాగతించాలి. ఈ క్రమంలో చైనా నిర్మించబోతున్న హిమాలయన్ ట్రైన్ రోడ్‌.. మన దేశానికి వచ్చేలా మన రైల్వే డ్రాగన్ కంట్రీతో మాట్లాడాలి.ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఈ చాణిక్య సూత్రాన్ని మనం ఫాలో అవ్వాలి.

ఎందుకంటే మన విరోధి స్నేహాన్ని కోరుకుంటున్నప్పుడు.. మనం ముందుకు అడుగువేస్తేనే.. భవిష్యత్‌లో మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే దేశాల మధ్యన డబ్బుతో స్నేహాలు తెంచుకుంటారో.. మొదట తీయగా ఉన్నా.. ఆ తరువాత చేదుగా మారుతుంది. దీనికి మంచి ఉదాహరణ శ్రీలంక. ఎన్ని చేసినా.. మనతో స్నేహం వదులుకునేందుకు శ్రీలంక ఎప్పుడూ ముందడుగు వేయదు. ఇక విదేశీ విషయాల్లో భారత్ కూడా సహనంగా ఉండగలిగాలి. సహనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ విధంగా అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అన్ని దేశాల నుంచి భారత్‌కు మరింత సానుకూలత లభించే అవకాశం కూడా ఉండొచ్చు.

ఇక మోదీతో భేటీ అనంతరం జిన్ పింగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల సమస్యలపై చర్చించేందుకు ఈ భేటీ సహాయం చేసిందని.. భవిష్యత్‌లో కూడా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతేకాదు వచ్చే ఏడాది ఇలాంటి భేటీ చైనాలో నిర్వహిస్తామని.. ఆయన భారత పర్యటనలో ఉండగానే అధికారిక ప్రకటన ఇచ్చేశారు. చూస్తుంటే జిన్ పింగ్ భారత్ పర్యటన మంచి ఫలితాలను ఇవ్వబోతోందని సుస్పష్టంగా అర్థమవుతోంది.

హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్