రామ్ లాలా వైపే ‘సుప్రీం’ మొగ్గు.. ఎందుకు ?

అయోధ్యలో వివాదాస్పద స్థలం మొత్తం రామ్ లాలా కే.. లేదా ‘ చిన్న బిడ్డగా పుట్టిన రామునికే ‘ అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అక్కడ రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. (అలాగే కొత్త మసీదును నిర్మించుకోవడానికి ముస్లిములకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది). ఇక్కడ ముస్లిముల తరఫు లాయర్ సమర్పించిన ఆధారాల కన్నా.. హిందూ సంఘాల తరఫు అడ్వొకేట్ సమర్పించిన ఆధారాలకే ‘ బలం ‘ ఎక్కువగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద […]

రామ్ లాలా వైపే 'సుప్రీం' మొగ్గు.. ఎందుకు ?
Follow us

|

Updated on: Nov 10, 2019 | 12:14 PM

అయోధ్యలో వివాదాస్పద స్థలం మొత్తం రామ్ లాలా కే.. లేదా ‘ చిన్న బిడ్డగా పుట్టిన రామునికే ‘ అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అక్కడ రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. (అలాగే కొత్త మసీదును నిర్మించుకోవడానికి ముస్లిములకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది). ఇక్కడ ముస్లిముల తరఫు లాయర్ సమర్పించిన ఆధారాల కన్నా.. హిందూ సంఘాల తరఫు అడ్వొకేట్ సమర్పించిన ఆధారాలకే ‘ బలం ‘ ఎక్కువగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద స్థలం బయట రామ్ చబుత్ర, ఇతర మత పరమైన చిహ్నాలు ఉన్నాయని,దీంతో అక్కడ ఏనాటి నుంచో హిందువులు పూజలు చేస్తున్నారని స్పష్టంగా రుజువైందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. 1857 లో ఇటుకలతో ఓ గోడ వంటి కట్టడం కట్టినప్పటికీ.. దానితో నిమిత్తం లేకుండా పూజలు జరుగుతున్నట్టు తేటతెల్లమైందన్నారు. వివాదాస్పద స్థలం ( మూడు డోమ్ ల కట్టడం) లోనికి వెళ్లాలంటే ఔటర్ కోర్టు యార్డుకు తూర్పు, ఉత్తర దిశల్లో ఉన్న ఏదో ఒక ద్వారం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అవి హిందూ భక్తుల అజమాయిషీలోనే ఉన్నాయి. అని కోర్టు వ్యాఖ్యానించింది.

1857 కు ముందు అంతర్భాగం తమదేనని చెప్పే ఆధారాలను ముస్లిములు చూపలేకపోయారని,, పైగా 16 వ శతాబ్దంలోనే అక్కడ కట్టడ నిర్మాణం ప్రారంభమైందని న్యాయస్థానం తన తీర్పులో తెలిపింది. ఆ స్థలంలో మసీదు ఉన్నప్పటికీ.. రాముడి జన్మస్థలం అదేనని హిందువులు పూజలు చేస్తూ వచ్చారని న్యాయమూర్తులు వివరించారు. ఇలా అన్ని అంశాలను పరిశీలించాకే రామ్ లాలా కు అనుకూలంగా కోర్టు రూలింగ్ ఇచ్చింది.