PBKS vs GT IPL 2022 Match Prediction: ముచ్చటగా మూడో విజయం కోసం.. హోరాహోరీ పోరుకు సిద్ధమైన పంజాబ్‌, గుజరాత్‌..

Punjab Kings vs Gujarat Titans Preview: ఐపీఎల్‌-2022 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్‌ 8) హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌( Gujarat Titans)..

PBKS vs GT IPL 2022 Match Prediction: ముచ్చటగా మూడో విజయం కోసం.. హోరాహోరీ పోరుకు సిద్ధమైన పంజాబ్‌, గుజరాత్‌..
Pbks Vs Gt
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2022 | 8:08 AM

Punjab Kings vs Gujarat Titans Preview: ఐపీఎల్‌-2022 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్‌ 8) హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌( Gujarat Titans), మయాంక్ అగర్వాల్ నాయకత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండూ మ్యాచ్‌ల్లోనూ విజయాలు నమోదు చేసుకుంది గుజరాత్‌ టైటాన్స్‌. పంజాబ్‌పై కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు అడుగేయాలని హార్ధిక్‌ బృందం భావిస్తోంది. కాగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.సరిగ్గా పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించింది. ముఖ్యంగా చివరి మ్యాచ్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ CSKను మట్టికరిపించింది. కాబట్టి వారి ప్లేయింగ్ XIలో కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చు.

బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

ఇక ఇరుజట్ల బలాబలాల విషయానికొస్తే.. గుజరాత్‌లో ఫెర్గూసన్‌తో పాటు మహ్మద్ షమీ లాంటి పేస్‌ బౌలర్లు ఉండడం సానుకూలాంశం. . అదే సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్‌లో సత్తాచాటుతున్నారు. వీరికి తోడు ఎలాంటి బ్యాటర్లనైనా ఉచ్చులో పడేసే స్పిన్నర రషీద్‌ఖాన్‌ ఉండనే ఉన్నాడు. కాబట్టి బౌలింగ్‌ విభాగంలో గుజరాత్‌ కు ఎలాంటి సమస్యలు లేవు. బ్యాటింగ్ విషయానికొస్తే.. గుజరాత్‌లో ఓపెనింగ్ జోడీ ఇంకా క్లిక్ కావడం లేదు. మాథ్యూ వేడ్ తన సత్తా చాటాల్సి ఉంది. గత మ్యాచ్‌లో మెరుపు ఇన్సింగ్స్‌ తో ఆకట్టుకున్న శుభ్‌మన్ గిల్ పంజాబ్‌పై కూడా రాణించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. మిడిలార్డర్‌లో కూడా గుజరాత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా అవసరమైనప్పుడు ఆదుకునేందుకు రెడీగా ఉన్నారు. అయితే విజయ్ శంకర్‌ ఫామే జట్టును ఆందోళన కలిగిస్తోంది.

సమతూకంతో..

పంజాబ్‌ విషయానికొస్తే.. ఓపెనింగ్‌లో శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్‌ తో కూడిన బలమైన జోడీ ఉంది. అయితే ఈ టోర్నీలో వీరిద్దరూ భారీస్కోర్లు చేయలేదు. ఇక మిడిలార్డర్‌లో భానుక రాజపక్సే, లివింగ్‌స్టన్, కొత్త ఆటగాడు జితేష్ శర్మ ఉన్నారు. ఫినిషర్ పాత్ర కోసం ఎలాగూ షారూఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్ ఉన్నారు. ఇక బౌలింగ్‌లో కగిసో రబడా, రాహుల్ చాహర్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరికి తోడుగా వైభవ్ అరోరా , అర్ష్‌దీప్ సింగ్ లాంటి యంగ్‌ బౌలర్లు ఉన్నారు. అవసరమైతే బౌలింగ్‌ లోనూ సత్తా చాటేందుకు ఓడియన్ స్మిత్, లివింగ్‌స్టన్‌ సిద్ధంగా ఉన్నారు.

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్:

మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, షారుఖ్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, ఇషాన్ పోరెల్, లియామ్ లివింగ్‌స్టన్, ఒడియన్ స్మిత్, సందీప్ శర్మ రాజ్ అంగద్ బావా, రిషి ధావన్, ప్రేరక్ మన్కడ్, వైభవ్ అరోరా, హృతిక్ ఛటర్జీ, బల్తేజ్ దండా, అన్ష్ పటేల్, నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, భానుకా రాజపక్స, బెన్నీ హోవెల్.

గుజరాత్ టైటాన్స్ జట్టు :

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యష్రీ దయాల్, అల్జ్రీ దయాల్ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్

Also Read: పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది !! పూసిన వెంటనే వాడిపోతుంది !!

CM Jagan: మంత్రుల రాజీనామాల తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని..

చవకైన అరటి..లాభాల్లో మేటి.. ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినేస్తారు..!

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??