ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ వినియోగంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి.. పేద దేశాలకు టీకా అందించేందుకు ఏర్పాట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఫైజర్-బయోఎంటెక్ కరోనావైరస్ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి లైన్ క్లియర్ అయ్యింది.

ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ వినియోగంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి.. పేద దేశాలకు టీకా అందించేందుకు ఏర్పాట్లు

WHO clears Pfizer vaccine: ప్రపంచ వ్యాప్తంగా ఫైజర్-బయోఎంటెక్ కరోనావైరస్ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి లైన్ క్లియర్ అయ్యింది.. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పేద దేశాలతోపాటు త్వరలో యూరప్, ఉత్తర అమెరికాల్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

ఔషధ నియంత్రణ సంస్థ ఉన్న ప్రతి దేశం ఏదైనా కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు స్వంతంగా ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అయితే బలహీనమైన వ్యవస్థలు ఉన్న దేశాల్లో వ్యాక్సిన్‌ను పరిశీలించడానికి, ఆమోదం తెలపడానికి డబ్ల్యూహెచ్ఓపైనే ఆధారపడతాయి. బయోఎంటెక్-ఫైజర్ వ్యాక్సిన్‌ను అల్ట్రా-స్తంభింపచేసిన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన ఫ్రీజర్‌లు, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహచ్ఓ వైపే ఇతర దేశాలు చూస్తుంటాయి. అయితే, త్వరలోనే కోవిడ్ -19 వ్యాక్సిన్ మొట్టమొదటి అత్యవసర వినియోగంపై నిర్ణయం తీసుకుంటామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడానికి, వ్యాక్సిన్ వినియోగానికి ఆయా దేశాలు తమ సొంత నియంత్రణకు ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని గ్లోబల్ బాడీ గురువారం తెలిపింది

.కాగా, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తోపాటు ఇతర దేశాలలో ఇప్పటికే క్లియరెన్స్ పొందిన ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ నిర్ధేశించిన భద్రత ప్రమాణాలు, సమర్థతను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక, పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్ వినియోగంపై డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సమావేశమైన సాధారణ కమిటీ ఇందుకు సంబంధించి ప్రణాళికలపై చర్చించింది. వ్యాక్సిన్ స్టోరేజ్‌కు సంబంధించి అల్ట్రా-కోల్డ్ చైన్ పరికరాలు అందుబాటులో లేని దేశాల్లో వ్యాక్సిన్‌ను వినియోగించడం పెద్ద సవాలుగా మారిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయా దేశాలకు టీకా డెలివరీ ప్రణాళికలను అంచనా వేయడంలోనూ.. సాధ్యమైన చోట ఉపయోగం కోసం సిద్ధం చేయడంలో దేశాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ.