Trump s India Visit: భారత్-అమెరికా మధ్య మరింత పటిష్ట బంధం.. వైట్ హౌస్ ప్రకటన

తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనపై వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి.రక్షణ, సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలనీ ట్రంప్, భారత ప్రధాని మోడీ  ఇద్దరూ నిర్ణయించుకోవడం ముదావహం.

Trump s India Visit: భారత్-అమెరికా మధ్య మరింత పటిష్ట బంధం.. వైట్ హౌస్ ప్రకటన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 26, 2020 | 1:14 PM

తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనపై వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ నెల 24-25 తేదీల్లో ట్రంప్ జరిపిన ఈ విజిట్ విజయవంతమైందని.. పేర్కొంటూ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఇది ఎంతో దోహదపడుతుందని ఈ వర్గాలు ప్రకటించాయి.  ఇక కొత్త శకం ఆరంభమైనట్టే అని అభివర్ణించాయి. రక్షణ, సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలనీ ట్రంప్, భారత ప్రధాని మోడీ  ఇద్దరూ నిర్ణయించుకోవడం ముదావహం. అలాగే అమెరికా నుంచి ఎంహెచ్-60 ఆర్ నేవల్..  ఏ హెచ్ -64 ఈ అపాచీ హెలీకాఫ్టర్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకోవడం ట్రంప్ పర్యటనలో అతి ప్రధాన అంశమని వైట్ హౌస్ పేర్కొంది. భారత ఉపఖండంలో సుస్థిరత, శాంతి నెలకొనేలా చూడాలన్న ఏకాభిప్రాయానికి ఇద్దరు అగ్ర నేతలూ వచ్చారని, అలాగే ఇండియాలోసాధ్యమైనంత త్వరలో ఆరు న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి టెక్నో-కమర్షియల్ ఆఫర్ ను ఖరారు చేసుకునేందుకు ఇండియాలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అమెరికాలోని వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ రెండూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉభయ నేతలూ ఒడంబడికకు రావడం హర్షణీయమని ఈ వర్గాలు ప్రశంసించాయి. భారత్ లోని ఇస్రో, తమ దేశంలోని నాసా అంతరిక్ష విజ్ఞాన సంబంధ సహకారాన్ని మరింత పెంచుకోవాలని, 2022 లో జాయింట్ మిషన్ కి శ్రీకారం చుట్టాలని వారు తీర్మానించిన విషయాన్ని వైట్ హౌస్ గుర్తు చేసింది. ఏమైనా.. ట్రంప్ భారత పర్యటన పట్ల అమెరికా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అధ్యక్ష భవబాణం పేర్కొంది.