దసరాకైనా అంతర్రాష్ట్ర సర్వీసులు మొదలవుతాయా.?

అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మొదలయ్యేది ఎప్పుడో తెలియట్లేదు.

  • Publish Date - 8:32 pm, Wed, 7 October 20
దసరాకైనా అంతర్రాష్ట్ర సర్వీసులు మొదలవుతాయా.?

Inter State Services: అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మొదలయ్యేది ఎప్పుడో తెలియట్లేదు. ఆర్టీసీ బస్‌ల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఉన్నతాధికారుల మధ్య మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ మరోసారి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల స్థాయిలో చర్చ జరిగింది. అది కూడా అసంపూర్ణంగానే ముగిసింది.

మూడు గంటల పాటు సాగిన ఈ చర్చలో.. రెండు లక్షల కిలోమీటర్లు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించగా.. టీఎస్ఆర్టీసీ మాత్రం 1,61,000 కిలోమీటర్ల మేరకు బస్సులు నడుపుకుందామని ప్రతిపాదించింది. ఇక దీనిపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని.. రెండు రోజుల తర్వాత మరోసారి చర్చించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

Also Read:

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!

అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. దరఖాస్తుకు మరోసారి అవకాశం.!

AP Eamcet 2020: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!

యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

షాకింగ్ న్యూస్: దేశంలో 16 నిమిషాలకు ఒక రేప్.. NCRB సర్వే సంచలనం!