వావ్ ! ప్యూర్ జాయ్ ! ఫ్యామిలీ సెలబ్రేషన్ !

అమెరికా ఎన్నికల్లో..ముఖ్యంగా చివరి దశలో పెన్సిల్వేనియా ఓటర్లు ఇచ్చిన ‘వరం’ తో (అత్యధిక ఓట్లతో) జో బైడెన్  విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టనుండడంతో ఆ కుటుంబ సంతోషానికి అవధులు లేకపోయాయి. వేలాది అమెరికన్లను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగం ముగించాక.. ఆయన ఫ్యామిలీ అంతా అక్కడ వేదికపై కలిసి సందడి చేసింది. అంతా ఆయనను అభినందించారు. ఒకరికొకరు హగ్ చేసుకున్నారు. జో మనుమలు, మనుమరాళ్ళు .. కొడుకులు, కుమార్తెలు అందరూ కలిసికట్టుగా కనిపించారు. జో కుమారుడు […]

  • Umakanth Rao
  • Publish Date - 11:34 am, Sun, 8 November 20
వావ్ ! ప్యూర్ జాయ్ ! ఫ్యామిలీ సెలబ్రేషన్ !

అమెరికా ఎన్నికల్లో..ముఖ్యంగా చివరి దశలో పెన్సిల్వేనియా ఓటర్లు ఇచ్చిన ‘వరం’ తో (అత్యధిక ఓట్లతో) జో బైడెన్  విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టనుండడంతో ఆ కుటుంబ సంతోషానికి అవధులు లేకపోయాయి. వేలాది అమెరికన్లను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగం ముగించాక.. ఆయన ఫ్యామిలీ అంతా అక్కడ వేదికపై కలిసి సందడి చేసింది. అంతా ఆయనను అభినందించారు. ఒకరికొకరు హగ్ చేసుకున్నారు. జో మనుమలు, మనుమరాళ్ళు .. కొడుకులు, కుమార్తెలు అందరూ కలిసికట్టుగా కనిపించారు. జో కుమారుడు హంటర్ కుమార్తె 27 ఏళ్ళ నవోమీ అందరినీ ఆకర్షించింది. జో మొదటి భార్య కేథలిన్ సైతం వచ్చి ఆయనకు కంగ్రాట్స్ చెప్పింది. ఇక ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోతున్న కమలా  హారిస్ కూడా తన లిటిల్ మేనకోడలితో అక్కడకి చేరి ఆయనకు అభినందనలు తెలియజేసింది.