What’s app privacy status: ప్రైవసీ రూల్స్‏పై మరోసారి వివరణ.. వైరల్ అవుతున్న వాట్సప్ కొత్త స్టేటస్..

గత కొన్ని రోజులుగా వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన మీద వస్తున్న సందేహాలు ఇంకా తొలగడం లేదు. ఇప్పటికే చాలావరకు వాట్సప్ యాప్‏కు

What's app privacy status: ప్రైవసీ రూల్స్‏పై మరోసారి వివరణ.. వైరల్ అవుతున్న వాట్సప్ కొత్త స్టేటస్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2021 | 9:43 AM

గత కొన్ని రోజులుగా వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన మీద వస్తున్న సందేహాలు ఇంకా తొలగడం లేదు. ఇప్పటికే చాలావరకు వాట్సప్ యాప్‏కు బదులుగా సిగ్నల్ యాప్, టెలిగ్రామ్ యాప్‍లను డౌన్ లోడ్ చేస్తున్నారు. దీంతో వాట్సప్ తన ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పటికే తాము యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‏బుక్ యాడ్‏లకు షేర్ చేయడం లేదని స్పష్టత ఇచ్చింది. అయినా కానీ యూజర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతుందని వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే వాట్సప్ యూజర్ల వ్యక్తిగత ఫోన్ నంబర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ప్రత్యేకమమ్యాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్‌ సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు రాజశేఖర్‌ రాజహరియా తన ట్విట్టర్‏లో షేర్ చేశారు కూడా. దీనిపై స్పందించిన వాట్సప్ తమ యూజర్ల నంబర్లను ఇండెక్స్ చేయవద్దని గూగుల్‏ని కోరింది.

Also Read:  ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

అంతే కాకుండా ప్రైవసీ పాలసీ నిబంధనపై వస్తున్న సందేహాల నేపథ్యంలో శనివారం వాట్సప్ వెనక్కి తగ్గింది. టర్మ్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయకపోతే ఫిబ్రవరి 8 నుంచి వాట్సప్ పనిచేయదని నిబంధనను వాయిదా వేసింది. మే 15 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుందని తన బ్లాగ్ పోస్టులో షేర్ చేసింది. ఇక ఆదివారం కూడా వాట్సప్ తన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ విషయాన్ని వాట్సప్ స్టేటస్‏లో అప్ డేట్ చేసింది. “మేము మీ వ్యక్తిగత భద్రతకు కట్టుబడి ఉన్నాం, ఎండ్ టూ ఎండ్ విధానం వలన వాట్సప్ మీ వ్యక్తిగత చాట్ హిస్టరీని చదవలేదు. మీరు షేర్ చేసే లొకేషన్ వివరాలు చూడలేదు. మీ కాంటాక్ట్స్ కూడా ఫేస్‏బుక్‏తో షేర్ చూసుకోదు” అని కొత్త ప్రైవసీకి సంబంధించిన కీలక విషయాలను యూజర్లకు వివరంగా చెబుతూ స్టేటస్ రూపంలో అప్‏డేట్ చేసింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..