ఆ నిర్ణయం వారిలో మార్పును తెస్తోంది.. ఎందుకో తెలుసా?

ఆ నిర్ణయం వారిలో మార్పును  తెస్తోంది..  ఎందుకో తెలుసా?

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం తర్వాత పరిస్థితి మహిళల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మద్యాన్ని నిషేదించి ఒక చారిత్రక ఘట్టానికి తెరలేపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనేక రకాల విమర్శలు చేసినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం అమ్మకాలపై ఉక్కపాదం మోపి చరిత్ర సృష్టించారు. ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని సీఎం జగన్ ముందకువెళ్లారు. మద్య నిషేదంపై ఆయన అక్టోబర్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 8:11 PM

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం తర్వాత పరిస్థితి మహిళల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మద్యాన్ని నిషేదించి ఒక చారిత్రక ఘట్టానికి తెరలేపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనేక రకాల విమర్శలు చేసినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం అమ్మకాలపై ఉక్కపాదం మోపి చరిత్ర సృష్టించారు. ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని సీఎం జగన్ ముందకువెళ్లారు. మద్య నిషేదంపై ఆయన అక్టోబర్ 1, 2019న కార్యాచరణను ప్రకటించారు.

రాష్ట్రాన్ని పాలించిన గత ప్రభుత్వాలు మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే పరిగణించాయి. అయితే మద్యపానంతో ఎంతోమంది అనారోగ్యం పాలు కావడం, రాష్ట్రంలో ఎక్కడిక్కడే నేరాలు పెరిగిపోవడం, ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడంపై సీఎం జగన్.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టకముందు నుంచే ప్రణాళిలు సిద్ధం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాల్లో దీన్ని చేర్చారు. అనుకున్నదే తడవుగా.. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుతూ దశలవారీగా మద్యనిషేదాన్ని అమలు చేయడం ప్రారంభించారు సీఎం జగన్.

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వీధి వీధిలో, ఇరుకు సందుల్లో, చిల్లర దుకాణాల్లో బెల్ట్ షాపులు ఉండటంతో మద్యం విపరీతంగా లభ్యమయ్యేది. సాధారణంగా వైన్ షాపులో కొనుగోలు చేసే ధరకంటే బెల్ట్ షాపుల్లో అధిక ధర చెల్లించి కొనుక్కుని మరీ మద్యం తాగేవారు. దీంతో రోజంతా కష్టపడి సంపాదించింది మొత్తం అక్కడే ఖర్చు చేయడం, ఇంటికి ఖాళే చేతులతో రావడం జరిగేది. దీంతో కుటుంబాల్లో గొడవలు మొదలయ్యేవి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దశలవారీగా చేపట్టిన మద్యనిషేదంతో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు. ఇవి రాష్ట్రంలో ఎక్కడా కనిపించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఆ తర్వాత నూతన మద్యం పాలసీని ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి మద్య నిషేదాన్ని అమలు చేయడం ప్రారంభించింది. అప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,380 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి వాటిని 3,500కు కుదించింది. అప్పటి వరకు రాత్రి 10 గంటలవరకు తెరచిఉండే షాపులను ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు కుదించారు. అదే విధంగా ఇప్పటివరకు వైన్‌షాపుల్లో కనిపించిన పర్మిట్ రూమ్‌ల నిషేదించారు. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ కూడా పెంచారు. దీంతో నిషేదాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో పాటు వేలమందికి కొత్త ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇప్పటికే కేరళ, రాజస్ధాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నాయి.

ఏది ఏమైనా పచ్చని కాపురాలను కూల్చుతూ.. సమాజంలో నేరాలు పెరిగిపోడానికి కారణమవుతున్న మద్యాన్ని నిషేదించాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టింది. అయితే పూర్తిగా నిషేదిస్తే కలిగే దుష్పరిణామాలను సైతం పరిగణలోకి తీసుకుని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయింది. ఇప్పటికే మద్యం విధానానికి అలవాటు పడుతున్న మద్యం ప్రియులు.. ఈ అలవాటుకు దూరం అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కష్టపడి సంపాదించిన కష్టార్జితాన్ని కుటుంబానికి వినియోగించుకుంటూ తమ భార్యా పిల్లలతో సంతోషంగా ఉండే పరిస్థితులు రాబోతున్నాయని పలువురు మహిళలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu